తెలంగాణ

మల్లన్న...మళ్లీ మొదటికొచ్చింది.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 4: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 123 జివో భూ సేకరణను హైకోర్టు రద్దు చేయడంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూ సేకరణ కార్యక్రమం మళ్లీ మొదటికొచ్చింది. రెండు నెలల పాటు నిరంతరాయంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగగా, పోలీసుల లాఠీ చార్జి, గాల్లోకి కాల్పులు జరిపి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రంగ ప్రవేశం చేసి కొండపాక, తొగుట మండలాలకు చెందిన ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, సింగారం తదితర గ్రామాల రైతులతో చర్చలు కొనసాగించి 123 జివో ప్రకారంగానే భూములు ఇస్తామని ఎట్టకేలకు ఒప్పించారు. లాఠీ చార్జి ఉద్రిక్తతతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు బాధితులను పరామర్శించడానికి ప్రయత్నించగా పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. గత్యంతరం లేక కాంగ్రెస్ నాయకులు హైకోర్టు ద్వారా అనుమతి పొంది వేములగట్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. జాతీయ పెట్టుబడులు, ఉత్పతుల సంస్థ (నిమ్జ్) కోసం జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో 123 జివో ప్రకారం రెవెన్యూ అధికారులు భూ సేకరణ చేసారు. ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారంతో తాము నష్టాలను చవిచూస్తున్నామంటూ 20 మంది రైతులు హై కోర్టులో దావా వేసారు. ఈ కేసు విచారణ చేసిన హైకోర్టు 123 జివోను రద్దు చేస్తూ 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం వర్తింపజేయాలని ఆదేశించడంతో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. బుధవారం కోర్టు తీర్పును వెల్లడించగా గురువారం నాడు కొండపాక మండలం రెవెన్యూ అధికారులు భూ సేకరణ నిమిత్తం ఎర్రవల్లి గ్రామానికి వెళ్లారు. తహశీల్దార్ విజయ బాస్కర్, ఆర్‌ఐ వేణుగోపాల్ రావు, విఆర్‌ఓ మల్లేషం ఎవ్రరల్లి గ్రామానికి వెళ్లి 123 జివో ప్రకారంగా భూములు అప్పగించాలని కోరారు. హైకోర్టు 123 జివోను రద్దు చేసిందని, 2013 చట్టం ప్రకారమైతేనే తాము భూములు అప్పగిస్తామంటూ అధికారులకు తేల్చి చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏలాంటి ఆదేశాలు లేకపోవడంతో చేసేదేమి లేక రెవెన్యూ అధికారులు వెనుదిరిగిపోయారు. మరోవైపు వేములగట్ గ్రామ ప్రజలంతా సంబురాలు జరుపుకుంటూనే ఉన్నారు. హై కోర్టును ఆశ్రయించిన నిమ్జ్ భూ బాధితులకు కూడా మరింత భరోసా లభించింది. కొంత మంది రైతులకు నేరుగా చెక్కులను పంపించగా మరికొంత మంది రైతుల అకౌంట్లకు పరిహారం డబ్బులు తర్జుమా చేసారు. కాగా ప్రస్తుతం హైకోర్టు వెల్లడించిన తీర్పుతో 2013 చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం, భూమి, ఇల్లు లేని వారికి ఉపాధి తదితర లాభాలు కలిగే అవకాశం ఉందన్న ఆశలు ఆయా ప్రాంతాలకు చెందిన నిర్వాసితుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎర్రవల్లి గ్రామస్తుల్లో మరోమారు చైతన్యం రాగా మిగిలిన గ్రామాల్లో కూడా రైతులు, ప్రజలు 2013 చట్టంపై మరోమారు మడతపేచి పెట్టి కూర్చునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. మొత్తంమీద హైకోర్టు వెల్లడించిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడిందని చెప్పవచ్చు.