ఆంధ్రప్రదేశ్‌

తెలుగు భాషను చంపేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 5: రాష్ట్రంలో తెలుగు భాషను చంపే ప్రయత్నం జరుగుతోందని లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపి డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 4000 ప్రాథమిక పాఠశాలలను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఆక్స్‌ఫోర్డు వర్సిటీ, యునెస్కో, తెలుగు భాషా శాస్తవ్రేత్తలు వివిధ సందర్భాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో ప్రాథమిక విద్య కేవలం మాతృభాషలోనే ఉండాలని వెల్లడైందని గుర్తుచేశారు. అయినప్పటికీ దానిని పట్టించుకోకుండా తెలుగుభాష స్థానంలో ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశపెట్టడం తెలుగు భాషను చంపే ప్రయత్నంగా అభివర్ణించారు. ఇంగ్లీషు భాషలో బోధించేందుకు నిర్ణయించినా అందుకు తగిన వసతులు ఉన్నాయా? బోధనకు తగిన ఉపాధ్యాయులు ఉన్నారా? అంశాన్ని కూడా విస్మరించారని ఆరోపించారు. ఆ దిశగా ఏర్పాట్లు చేయకుండా కూడా ప్రారంభించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

తహశీల్దార్‌పై యాసిడ్ దాడి యత్నం
పిసిపల్లి, ఆగస్టు 5: ప్రకాశం జిల్లా పిసి పల్లి తహశీల్దార్ కార్యాలయంలో యాసిడ్ దాడి కలకలం లేపింది. గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో తహశీల్దార్ కార్యాలయానికి తాళాలు వేసి, శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల తరువాత కార్యాలయం తలుపులు తీశారు. తలుపులు తీసిన సిబ్బంది హాలులో డిప్యూటి తహశీల్దార్ సీటు వద్ద ఉన్న సీలింగ్ ఫ్యాన్ స్విచ్చ్ వేయగా ఫ్యాన్ రెక్కలపై వాటర్ బాటల్ మూతలో ఉంచిన యాసిడ్ ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడంతో పక్కనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ నరేష్‌పై సమీపంలో ఉన్న తహశీల్దార్ ఎస్‌కె వౌలాలా సాహెబ్‌పై పడటంతో వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కార్యాలయం తలుపులు వేసినవి వేసినట్లు ఉన్నా, తహశీల్దార్ గదిలో యాసిడ్ ఉండటం ఆందోళనకు గురిచేసింది. ఈ విషయమై తహశీల్దార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనిగిరి సిఐ సుధాకర్‌కు విషయం అందజేశారు. కనిగిరి సిఐ హుటాహుటిన హనుమంతునిపాడు ఎస్‌ఐతో కలిసి స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్దకు చేరుకొని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందిని విడివిడిగా విచారించారు. సిబ్బంది సహకారంతో ఈ దుస్థితి జరిగిందా? లేదా బయట వ్యక్తుల కార్యాలయం పై భాగం నుండి లోపలకి ప్రవేశించి ఈ ఘతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

32 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్

రేణిగుంట, ఆగస్టు 5: శేషాచలం అటవీప్రాంతంలోకి వెళ్లి ఎర్రచందనం దుంగలను నరికేందుకు వెళ్తున్న తమిళనాడుకు చెందిన 32 మంది ఎర్రకూలీలను అరెస్ట్‌చేయగా ఇద్దరు స్మగ్లర్లు పరారుకాగా, అరెస్టయిన వారి నుంచి 20 గొడ్డళ్లు, 20 సెల్‌ఫోన్లు, 10 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు డి ఎస్పీ నంజుండప్ప తెలిపారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో డి ఎస్పీ మాట్లాడుతూ టాస్క్ఫోర్స్ అటవీశాఖ పోలీసులకు అందిన సమాచారం మేరకు రేణిగుంట మండలం వెంకటాపురం వద్ద ఉన్న స్మశాన వాటిక వద్ద అడవిలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఎర్రకూలీలపై దాడిచేసి 32 మంది ఎర్రకూలీలను అరెస్ట్‌చేయగా తిరువణ్ణామలైకు చెందిన కుమార్, దేవరాజ్ అనే ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారు.

ధవళేశ్వరం వద్ద నిలకడగా గోదావరి

రాజమహేంద్రవరం, ఆగస్టు 5: అఖండ గోదావరి నది వరద ఉద్ధృతి నిలకడగావుంది. ఎగువ భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టాన్ని నిలకడగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం బ్యారేజి నుంచి 5 లక్షల 30వేల 174 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం ఆర్మ్ పరిధిలోని గేట్లను ఒక మీటరు, ర్యాలీ ఆర్మ్‌లోని గేట్లను 1.5 మీటర్లు, మద్దూరు ఆర్మ్‌లోని గేట్లను 1.5 మీటర్లు, విజ్జేశ్వరం ఆర్మ్‌లోని గేట్లను ఒక మీటరు మేరకు ఎత్తి వేసి వరద జలాలను దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద 10.9 అడుగులు నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 29.8 అడుగుల నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజి నుంచి ఈస్ట్రన్ డెల్టాకు 3,800 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2,000, వెస్ట్రన్ డెల్టాకు 5,500 క్యూసెక్కులు కాల్వకు నీటిని విడిచిపెట్టారు.

రూ.110.96 కోట్ల చేనేత రుణమాఫీ

అనంతపురం, ఆగస్టు 5: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుప్రతిష్టాత్మకమైన చేనేత రుణమాఫీకి శనివారం శ్రీకారం చుట్టనున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ పథకాన్ని సిఎం ప్రకటించనున్నారు. రూ.110.96 కోట్లతో రాష్ట్రంలో 23,525 మంది చేనేతలకు రుణమాఫీ వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా మెగా చెక్ విడుదల చేయనున్నారు. అలాగే వివిధ పథకాల కింద మొత్తం 301.5082 కోట్లు విడుదల చేస్తారు. ఇందులో రాష్టవ్య్రాప్తంగా 27,703 మంది చేనేతలకు లబ్ధి చేకూర్చే సిల్క్ యార్న్ సబ్సిడీ సిరికల్చర్ ద్వారా రూ.25 కోట్లు విడుదల చేస్తారు. గ్రామీణ ప్రాంతంలోని 4,246 స్వయం సహాయక సంఘాలకు డిఆర్‌డిఏ ద్వారా రూ.120.71 కోట్లు, అర్బన్ ప్రాంతాల్లోని 1064 స్వయం సహాయక సంఘాలకు మెప్మా ద్వారా రూ.44.12 కోట్లు బ్యాంక్ లింకేజీ నిధులు విడుదల చేయనున్నారు.

భక్తులకు అందుబాటులో 40వేల ఆర్జిత సేవా టిక్కెట్లు

తిరుమల, ఆగస్టు 5: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి అక్టోబర్ 1నుంచి 31వ తేదీ వరకు భక్తులు ముందుగా టిక్కెట్లను కొనుగోలుచేసేందుకు వీలుగా 40వేల 87 టిక్కెట్లను ఇంటర్నెట్‌లో ఉంచినట్టు ఇవో సాంబశివరావు తెలిపారు. అక్టోబర్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో కొన్ని ఆర్జిత సేవలు రద్దుచేశామని తెలిపారు. కాగా ఇంటర్నెట్‌లో ఉంచిన టిక్కెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాత సేవ - 5,477వేలు, అర్చన - 80, తోమాల -80, సోమవారం నిర్వహించే విశేషపూజ- 1,125, మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన - 40, శుక్రవారం భక్తులకు కల్పించే నిజపాద దర్శనం - 1,125, ప్రతిరోజూ ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం - 7,875, వసంతోత్సవం - 8,170, ఆర్జిత బ్రహ్మోత్సవం - 4,515, సహస్రదీపాలంకరణ సేవ - 9,500, ఊంజల్ సేవ - 2,100 టిక్కెట్లు అందుబాటులో ఉంచామన్నారు.