తెలంగాణ

ప్రధాని పర్యటనతో ఒరిగిందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటీ? అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్తులో టిఆర్‌ఎస్-బిజెపి కలిసి ప్రయాణించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం విలేఖరుల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఆ రెండు పార్టీలూ పొత్తు కోసం తహతహలాడుతున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ అడుగు పెట్టినందున భారీగా నిధులు, వివిధ పథకాలు ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని ఆయన తెలిపారు. ప్రధాని పర్యటనతో ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. యూరియా రేట్లు తగ్గించామని చెప్పడం ప్రధానికి తగదని ఆయన తెలిపారు. నామమాత్రంగానే ధరలు తగ్గించారని అన్నారు. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినా, ఆ మేరకు యూరియా ధరలు తగ్గలేదని ఆయన తెలిపారు. మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగింది కాబట్టి దానిని కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని మోదీతో ప్రారంభించారని ఆయన విమర్శించారు. గోదావరి నదీ జలాల విషయంలో ప్రభుత్వం చేసేంది ఏమీ లేదని అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో మంజూరైన పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారని ఆయన తెలిపారు. తెలంగాణలో దళితులకు అన్యాయం జరుగుతున్నా ప్రధాని ఆ ప్రస్తావనే తేలేదని అన్నారు. మల్లన్న సాగర్‌ను సందర్శించి రైతులను పరామర్శించాలనుకున్న తమ పార్టీ నేతలను గృహ నిర్భందం చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.