తెలంగాణ

ఇంద్రపాలనగరంలో టిఆర్‌ఎస్ వర్గపోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, ఆగస్టు 8: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో ఆదివారం రాత్రి టిఆర్‌ఎస్ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి బంధువు మందడి విద్యాసాగర్‌రెడ్డి ఇంటిపై పూస బాలకిషన్ వర్గానికి చెందిన కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసి విద్యాసాగర్‌రెడ్డితోపాటు, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టారు. దాడి సమయంలో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి కూడా అదే ఇంట్లో ఉన్నారు. కార్యకర్తల దాడిలో ఆయన కూడా స్వల్పంగా గాయపడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌రెడ్డి సోదరుడు శ్రీ్ధర్‌రెడ్డి, కుమారుడు సిద్దార్థరెడ్డి, బంధువులు రేగట్టె జయశంకర్‌రెడ్డి, బేతి మధుమోహన్‌రెడ్డి, శోభలను హైదరాబాద్ తరలించి కేర్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ఇంటిముందు నిలిచిఉన్న రెండు కార్లను, ఒక మోటారు సైకిల్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంటి కిటికీలకు ఉన్న అద్దాలను పగులగొట్టారు. దాడి సంఘటన తెలుసుకున్న జిల్లా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి, నల్లగొండ డిఎస్పీ సుధాకర్ తమ బలగాలతో రాత్రి ఒంటిగంటకు గ్రామానికి చేరుకుని దాడికి పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా గ్రామంలో టిఆర్‌ఎస్ వర్గపోరు నడుస్తుండగా ఆదివారం జరిగిన బోనాల ఉత్సవంలో చోటుచేసుకున్న ఘర్షణ దాడికి కారణమని గ్రామస్థులు బావిస్తున్నారు.
దాడిని నిరసిస్తూ గ్రామస్థుల రాస్తారోకో
మందడి విద్యాసాగర్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామస్థులు చిట్యాల భువనగిరి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అరగంటసేపు వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. సర్పంచ్‌కు, ఎమ్మెల్యేకు, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. రామన్నపేట, చిట్యాల సిఐలు మామిండ్ల శ్రీ్ధర్‌రెడ్డి, శివరాంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 30 మందిపై కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీ్ధర్‌రెడ్డి తెలిపారు.

చిత్రం.. టిఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వాహనాలు, గాయపడిన శ్రీ్ధర్‌రెడ్డి (ఇన్‌సెట్)