తెలంగాణ

షాద్‌నగర్‌లో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 8: మోస్ట్ వాంటెడ్‌గా..గ్యాంగ్‌స్టర్‌గా చలామణి అవుతున్న నరుూంను పోలీసులు హతమార్చిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నరుూం ముఠాకు చెందిన గుంటూరు జిల్లా వాసి బాషా గత ఏడాదిన్నర క్రితం షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఓ ఇంటిని కొన్నాడు. అప్పటి నుండి (దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి) నరుూం కూడా తన ముఠా సభ్యులతో కలసి ఇక్కడి నుంచే సెటిల్‌మెంట్లు, దందాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరుూంను హతమార్చిన పోలీసులు మరో 11మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. షాద్‌నగర్‌లో నరుూం ముఠా ఉనికి బయటపడడంతో ఈప్రాంతంలో ప్రజలు ఉలిక్కిపడ్డారు. మిలీనియం టౌన్‌షిప్‌లో ఎన్‌కౌంటర్ జరిగిందని ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు బయటికి పొక్కడంతో షాద్‌నగర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఘటనాస్థలానికి వచ్చారు. అయితే ఉదయం ఏడుగంటలకు జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఏ ఒక్కరినీ ఘటన స్థలానికి పోలీసులు అనుమతించలేదు. నరుూం లాంటి గ్యాంగ్‌స్టర్ షాద్‌నగర్‌లో మకాం వేయడం, ఇక్కడి నుండి కోట్ల రూపాయల డీల్స్ చేయడం వంటివి బయటపడడం. ఈప్రాంత ప్రజలను భయానక పరిస్థితికి నెట్టివేసింది. అసలు గుంటూరు జిల్లాకు చెందిన బాషాతోపాటు షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఇంకెవరైనా నరుూంముఠాలో ఉండొచ్చనే అనుమానాలు కూడా ఇక్కడి పోలీసు యంత్రాంగం వ్యక్తం చేస్తున్నది.