తెలంగాణ

రౌడీషీటర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, ఆగస్టు 8: హైదరాబాద్ బోరబండలోని నెహ్రూనగర్‌కు చెందిన రౌడీషీటర్ వాహెద్ (35) మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు వసీం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హతుడికి అత్యంత సన్నిహితులైన ఫేరోజ్, యూసుఫ్, సయ్యద్, సర్వర్, అసద్, సలావుద్దీన్‌లే తన అన్నను హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫేరోజ్ తల్లి కార్పొరేటర్‌గా బరిలోకి దిగింది. ఆమెను కాదని వాహెద్ మరొకరికి మద్దతునివ్వడంతో ఫెరోజ్ తల్లి ఓటమిపాలైంది. దీంతో ఫేరోజ్, వహీద్‌పై కక్షపెంచుకున్నాడు. వివిధ కేసులతో జైలుపాలైన వాహెద్ రంజాన్ సందర్భంగా బెయిల్‌పై విడుదలయ్యాడు వహీద్ జైల్లో ఉన్న సందర్భంలో ఆయన స్థానాన్ని ఫేరోజ్ ఆక్రమించి అన్ని సెటిల్‌మెంట్లు ఇతర అసాంఘిక కార్యకలాపాలను యధేచ్చగా నిర్వహించాడు. వహీద్ జైలునుంచి వచ్చాక తిరిగి ఆయన కిందే పనిచేయాల్సి వచ్చింది. దీనిని జీర్ణించుకోలేని ఫేరోజ్ వహీద్‌ను హతమార్చాలని పథకం పన్నాడు. వీకెండ్ పార్టీ పేరుతో ఫేరోజ్ మరో ఆరుగురు మిత్రులు, ఐదుగురు మహిళలతో వాహెద్‌ను పథకం ప్రకారం జహీరాబాద్ సమీపంలోని పర్వేజ్ ఫాంహౌస్‌కు తీసుకువచ్చారు. వాహెద్ చేత మద్యం తాగించారు. అనంతరం అదునుచూసి కత్తులతో దాడిచేశారు. విచక్షణారహితంగా గొంతు, ఎద, చేయి, తొడ, మర్మాంగాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ పొడిచారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి వాహెద్ మృతి చెందాడు. హతుడి తమ్ముడు వసీమ్ ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నాగరాజ్ తెలిపారు. హతుడిపై ఏడు హత్య కేసులతోపాటు 35 ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డిఎస్పీ తిరుపతన్న సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

చిత్రం.. హత్యకు గురైన రౌడీషీటర్ వాహెద్