తెలంగాణ

సర్కార్‌కే సవాల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: పేరు మోసిన గ్యాంగ్‌స్టర్, మాజీ నక్సలైట్ నయాం ఎన్‌కౌంటర్ వెనుక అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన పరిణామాలే నయాం ఎన్‌కౌంటర్‌కు దారితీసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. నక్సల్స్, పౌరహక్కుల నేతలను చేతికి మట్టిఅంటకుండా మట్టుబెట్టడానికి పోలీసు బాసులకు నయాం పావుగా ఉపయోగపడేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి దాకా భూదందాలు, సెటిల్‌మెంట్లకు మాత్రమే పరిమితం అయిన నరుూమ్, చివరకు టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరిని టార్గెట్ చేసి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్టు తెలిసింది. పైగా నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా సమసిపోయిన నేపథ్యంలో ఇక నరుూమ్ అవసరం లేదనే పోలీసులు అతన్ని ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టడానికి మరో కారణమై ఉండవచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలను అంతమొందించడానికి నయాం పథక రచన చేసినట్టు ప్రభుత్వ అధినేతలకు సమాచారం అందడంతో ఇంతకాలం అతణ్ణి రక్షిస్తూ వచ్చిన పోలీసు బాసులు ఇక కాపాడలేకపోయినట్టు తెలిసింది.
కోనపురి రాములు హత్య జరిగిన సందర్భంగా తమ పార్టీ నేతలను టార్గెట్ చేసి చంపిన నయాంను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ అధినేతకు అతి సన్నిహితంగా ఉండే ఒకరు హెచ్చరించగా, సదరు నేతకు కూడా నయాం ఫోన్ చేసి బెదిరించినట్టు తెలిసింది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నియోజకవర్గంలో తిరగాలంటే ఏడాదికి తనకు రూ. 20కోట్ల కప్పం చెల్లించాలని నయాం వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. అలాగే పూర్వాశ్రమంలో నక్సల్స్ గ్రూపుల్లో పనిచేసిన నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు నయాం ముఠాతో చాలాకాలం నుంచి గొడవలు ఉన్నాయి. జిల్లాలో నయాం బాధితులకు వీరేశం అండగా నిలుస్తున్నాడన్న ఆగ్రహంతో అతణ్ణి చంపడానికి ఈ ముఠా సుపారీ ఇచ్చినట్టు ప్రభుత్వ అధినేతల దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. ఈ కారణంగానే నయాం ముఠాతో వీరేశానికి ప్రాణహాని ఉందని అతనికి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చినట్టు తెలిసింది. నల్లగొండ జిల్లాలోనే కాకుండా మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిని కూడా చంపుతానని అనేకమార్లు నయాం వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా ప్రభుత్వాధినేతల దృష్టికి వెళ్లినట్టు సమాచారం. క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో నయాంకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో అతని ఆచూకీ కనిపెట్టేపనిని ఉన్నతాధికారులు స్పెషల్ టీమ్‌కు అప్పగించినట్టు తెలిసింది. ఈ స్పెషల్ టీమ్ ఒక భూవివాదాన్ని సృష్టించి బాధితులు నయాం ముఠాను ఆశ్రయించేటట్టు చేసి తమ వలకు చిక్కేటట్టు చేసినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. స్థానిక పోలీసులకు ఏమాత్రం సమాచారం లేకుండా గ్రేహాండ్స్ బలగాలు నేరుగా నయాంను ఎన్‌కౌంటర్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

చిత్రం.. నయాముద్దీన్ ఎన్‌కౌంటర్‌కు గురైన ప్రదేశం ఇదే