తెలంగాణ

ముగిసిన నేర ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 8: పోలీసుల అండతో హత్యలకు, సెటిల్‌మెంట్లకు పాల్పడి మాఫియా లీడర్‌గా ఎదిగిన మాజీ మావోయిస్టు నరుూం నేర ప్రస్థానం చివరకు పోలీసుల ఎన్‌కౌంటర్‌తోనే ముగిసింది. నరుూం పేరు వింటేనే భువనగిరితో పాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, హైద్రాబాద్‌లలో జనం వణికిపోయేంతంగా అతడు హత్యలకు పాల్పడుతూ మాఫియా లీడర్‌గా ఎదిగాడు. అతడిపై ఆయా జిల్లాల్లో 100 కేసులు, 21హత్య కేసులున్నాయి.
ఆది నుండి నేర స్వభావమే...!
భువనగిరికి చెందిన నరుూం విద్యుత్ శాఖలో డ్రైవర్‌గా పనిచేసిన ఖాజానసీరుద్దీన్, తయేరబేగంల కుమారుడు. చిన్నప్పటి నుండి విచిత్ర స్వభావి. పాములు, తేళ్లను పెంచుకునేవాడు. 1989లో పీపుల్స్‌వార్‌లో చేరాడు.
చంచల్‌గూడ జైలులో మావోయిస్టు నేతలు శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డిలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. పీపుల్స్‌వార్ కార్యకర్తగా హైద్రాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో 1993 జనవరి 27న గ్రేహౌండ్స్ పోలీస్ వ్యవస్థాపకుడైన ఐపిఎస్ వ్యాస్‌ను కాల్చి చంపాడు.
కొద్దికాలానికే స్థానిక పౌరహక్కుల నేతలతో, పీపుల్స్‌వార్ నాయకులతో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భువనగిరి చెందిన ప్రజాగాయకురాలు బెల్లిలలితను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి శరీరభాగాలను వేర్వేరు చోట్ల పడేసి క్రూరమైన నేరాలకు తెరలేపాడు.
పోలీసులకు కోవర్ట్‌గా మారిన నరుూం నక్సల్ దళాల ఆచూకీని పోలీసులకు చేరవేసి పలు ఎన్‌కౌంటర్లకు సహకరించాడన్న ఆరోపణలున్నాయి.
మాజీ నక్సల్స్ ఈదన్న, గణేష్, పౌరహక్కుల నేతలు నిరంజన్, శ్రీరాములు, మల్లేశ్, ఆజం అలీల హత్యలలో సైతం నరుూం నిందితుడు.
పోలీసుల అండతో రెచ్చిపోయిన నరుూం పలువురు మాజీలను, యువకులను చేరదీసి ముఠాలు ఏర్పాటు చేశాడు. భూ సెటిల్‌మెంట్లు, బలవంతపు వసూళ్లతో నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు.
విశాఖనాగులు, బ్లాక్‌కోబ్రా, గ్రీన్‌టైగర్స్ పేరుతో ప్రత్యర్థులపై బెదిరింపులకు పాల్పడేవాడు.
కొణపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడిని నరుూం ముఠా 2011 మార్చి 27న సొంత మండలంలో గోకారం వద్ద వేటకొడవళ్లు, గొడ్డలతో దాడి చేసి హతమార్చారు. 2011డిసెంబర్ 28న గ్యాంగ్‌స్టర్ పటోళ్ల గోవర్ధన్‌రెడ్డిని హతమార్చారు. 2014 మే 11న సాంబశివుడి సోదరుడైన టిఆర్‌ఎస్ నేత, మాజీ మావోయిస్టు కొణపురి రాములును సైతం నరుూం ముఠా నల్లగొండలో పట్టపగలే ఫంక్షన్ హాల్ ముందు కాల్చిచంపింది.
పోలీసులు అతడిని పలుమార్లు అరెస్టు చేసినప్పటికీ నాటకీయ ఫక్కీలో 11సార్లు తప్పించుకున్నాడు. నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంలో అతడు తప్పించుకున్న తీరు పోలీసులను విమర్శలపాలుచేసింది.
నరుూం హత్యల పద్ధతి పక్కా ప్రొఫెషనల్‌గా ఉండేది. హత్య చేసిన వారు ఒకరైతే లొంగిపోయే వారు ఇంకొకరు కావడం చివరకు సాక్ష్యాలు లేక కేసులు వీగిపోవడం జరుగుతుండేది.
వ్యాస్ హత్య కేసులోనూ నరుూంకు వ్యతిరేకంగా పోలీస్ శాఖ నుండి సైతం సాక్ష్యం లేక 14ఏళ్లు విచారణ జరిగినా చివరకు అతడు నిర్దోషిగా విడుదలయ్యాడు.
నరుూం తాను అనుమానించిన అనుచరులను సైతం దారుణంగా చంపాడు. తన మాటవినలేదన్న నెపంతో ఆసీఫ్, అఫ్జల్‌లను అడ్డుతొలగించాడు. ఇటీవల ఆయన ప్రధాన అనుచరుడు షకీల్ అనుమానాస్పదంగా మృతి చెందగా, పాశం శ్రీను, సందెల సుధాకర్‌లు పోలీసులకు లొంగిపోయారు.

చిత్రం.. భువనగిరిలోని నరుూం ఇల్లు