తెలంగాణ

పుష్కరాలకు ప్రత్యేక వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: కృష్ణా పుష్కరాల సందర్భంగా సమాచారాన్ని భక్తులకు అందించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌ను (హెచ్‌టిటిపి://పుష్కరాలు.తెలంగాణ.జిఓవి.ఇ) దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన రెండు మొబైల్ యాప్‌లను దీనికి అనుసంధానం చేశారు. పుష్కరాల సమయంలో ఎక్కువ రద్దీ ఉన్న ఘాట్ల వివరాలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అనుసంధానం చేశామన్నారు. రద్దీ ఉన్న స్నానపు ఘాట్ల వివరాలు భక్తులకు తెలిస్తే సమీపంలోని ఇతర ఘాట్లకు వెళ్లేందుకు వీలవుతుందన్నారు. ఇలా ఉండగా దేవాదాయ శాఖ మరో వెబ్‌సైట్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఎండోమెంట్స్.టిఎస్. ఎన్‌ఐసి.ఇన్)ను రూపొందించింది. పుష్కర యాత్రికుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు 040-2475 5522/ 2475 0102/ 77940 14301/ 77940 14302. పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ నెంబర్ల ద్వారా తెలుసుకునేందుకు వీలుందని మంత్రి తెలిపారు.