తెలంగాణ

కృష్ణా జలాలను కలుషితం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: కృష్ణా పుష్కరాలు పవిత్రమైనవని, ఈ సందర్భంగా కృష్ణా నదీజలాలను కలుషితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నదీ జలాలను పవిత్రంగా ఉంచుకోవాలన్నారు.
పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లను వాడవద్దన్నారు. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన బ్యానర్లు, పోస్టర్లు, మొబైల్ యాప్‌ను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పుష్కరాల సందర్భంగా స్నానపుఘాట్ల వద్ద నీటిని ప్రతి మూడు గంటలకు ఒకసారి పరీక్షలకు పంపిస్తారని, 13 రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ జలాలను హైదరాబాద్‌లోని కేంద్రీయ ప్రయోగశాలకు పంపి, ఆ వివరాలను ప్రజలకు తెలియచేస్తామన్నారు. ఇందుకోసం ‘కృష్ణాపుష్కరాలు 2016’ అనే యాప్ ద్వారా వివరాలు వెల్లడిస్తామన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పుష్కరస్నానం ఆచరించే మహబూబ్‌నగర్ జిల్లా గొందిమల్ల పుష్కరఘాట్ వద్ద నీటినాణ్యత పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
పుష్కరాల సందర్భంగా అటవీశాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ గ్రీన్ కాప్స్ వలంటీర్లు 100 మంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భక్తులకు సేవలు అందిస్తారని మంత్రి తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రితో పాటు కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి అనిల్‌కుమార్ కూడా పాల్గొన్నారు.