తెలంగాణ

స్వాతంత్య్ర వేడుకలకు పటిష్ఠ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో సమీక్ష జరిపారు. ప్రజలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమర యోధులు, విద్యార్థులు పాల్గొంటారని, దీనిని దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత సంవత్సరం వలెనే ఈసారి కూడా వేడుకలను తిలకించేందుకు దాదాపు ఐదువేల పాసులను జారీ చేయనున్నట్టు చెప్పారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులను తరలించడానికి అవసరమైన మినీ బస్సులను ఏర్పాటు చేస్తారు. స్వాతంత్య్ర సమర యోధులను వేదిక వరకు తీసుకు రావడానికి అవసరమైన వీల్ చైర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.