తెలంగాణ

14న ‘అఖండ భారత దివస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చార్మినార్, ఆగస్టు 11: ఈ నెల 14న భారతదేశం ముక్కలైన రోజని, ఆ రోజును ఖండిస్తూ అఖండ భారతావనిని మళ్లీ సాధించాలని పిలుపునిచ్చాయి బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్‌లు. బజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ భానుప్రకాష్ గురువారం హైదర్‌గూడా ఎన్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే ముక్కలైన భారతదేశాన్ని మరిన్ని ముక్కలు చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అఫ్గానిస్తాన్, నేపాల్, భూటాన్, టిబెట్, మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భారతదేశం నుండి విడిపోయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ముక్కలుగా విడిపోయిన భారతదేశ ప్రాంతాలన్నిటిని మళ్లీ ఏకం చేయాలని బజరంగ్‌దళ్ సంకల్పిస్తోందన్నారు. 14న నారాయణగూడ కేశవ మెమోరియల్ విద్యాసంస్థ ఆవరణలో ‘అఖండ భారత దివస్’ పేరిట బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ బహిరంగ సభలో విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ముఖ్య వక్తగా, ముఖ్య అతిథిగా రాఘవరెడ్డి పాల్గొంటారని తెలిపారు. భారతదేశం మళ్లీ అఖండ భారతావనిగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ నిర్వహించే ఈ సభలో కులాలు, మతాలకతీతంగా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బజరంగ్‌దళ్ భాగ్యనగర్ విభాగ్ కన్వీనర్ వీరేశలింగం, రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ కార్యాధ్యక్షుడు సురేందర్, సహకార్యదర్శి పూల్లా సత్యనారాయణ, సభాష్‌చందర్, మీడియా కన్వీనర్ కైలాష్ పాల్గొన్నారు.