తెలంగాణ

వేగంగా కేసుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: న్యాయం కోసం ఎదురుచూస్తున్న వారి కేసులను వేంగా పరిష్కరించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపైనా, న్యాయవాదులపైనా ఉందని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్ అన్నారు. న్యాయస్థానాలను మొత్తం ప్రజల్లో 10 శాతం మంది వరకూ ఆశ్రయిస్తున్నారని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. సోమవారం జరిగిన స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా త్రివర్ణపతాకాన్ని జస్టిస్ రమేష్ రంగనాధ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాల తర్వాత మనం అన్ని వివాదాలను పక్కన పెట్టి కలిసి కట్టుగా దేశాభివృద్ధికి కృషి చేయాలని భావిస్తున్న ఈ తరుణంలో లేని వారి గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉందని పేర్కొన్నారు. కోర్టు కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయని, అయితే ఈ రోజు అంతర్గతంగా బహిర్గతంగా ఉన్న లోపాలను విశే్లషించుకోవడం కంటే ఎంత తొందరగా మనం అన్ని వర్గాలకూ న్యాయాన్ని చేరువ చేస్తామో ఆలోచించాలని అన్నారు. అట్టడుగు వర్గాల సహానుభూతి అసమర్ధత వల్ల వారే మనకు దూరం అవుతున్నారని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి, ఎపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, బార్ అధ్యక్షులు సి నాగేశ్వరరావు, గండ్ర మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదులు పి బాలకృష్ణ మూర్తి, కె ప్రతాప్‌రెడ్డి, బివి సుబ్బయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, ఎ పుల్లారెడ్డి, ఇ మనోహర్, కె వి సత్యనారాయణ, కె వి సుబ్రమణ్య నరసు, సి ఆనందరావు, టి బాలిరెడ్డి, కోక రాఘవరావులను సత్కరించారు.