తెలంగాణ

ఊరంతా జ్వరమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవపూర్, ఆగస్టు 15: కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం బెగులూర్ గ్రామమంతా జ్వరంతో బాధపడుతోంది. గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ ఒక్కరిద్దరు చొప్పన విష జ్వరాలతో బాధపడుతున్నారు. సర్కారు వైద్యం గ్రామంలో ఏర్పాటు చేసినా లాభం లేకపోవడంతో గ్రామంలోని వారు మెరుగైన వైద్యం కోసం వరంగల్, హన్మకొండ, పరకాల, భూపాలపల్లి, కరీంనగర్ పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే బండారు మాంతయ్య, గడ్డం అక్షిత, తిర్కారీ రేణుక, తుంగ సమ్మయ్య, కారు లింగయ్య శ్రీను, మల్లాగౌడ్ అనే వ్యక్తులు మృత్యువాత పడ్డారు. జ్వరం నయం కాకపోవడంతో చల్లా స్వరూప, కొడుకు సిద్ధార్థ, శ్రీనివాస్, రాజు, తిరుపతమ్మ వరంగల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం కొట్టచ్చిన్నట్లు కనబడుతోంది. గ్రామంలో సైడ్ డ్రైన్ లేక ఎక్కడిక్కడే మురుగు నీరు నిలిచి దోమలు, ఈగలు వృద్ధి చెందడం, మంచి నీరు కూడా కలుషితం కావడం దీనికి ప్రధాన కారణం. జిల్లా వైద్యాధికారులు శ్రద్ధ చూపినా బెగులూర్ గ్రామంలో జ్వరాలు అదుపులోకి రాకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లిపోతున్నారు. బెగులూర్‌లో నాణ్యమైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. గ్రామంలో విష జ్వరాలు ఎందుకు వస్తున్నాయో తెలియక గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం మంచినీటి నమునాలు సేకరించేందుకు అధికారులు వచ్చారు. ఏదేమైనప్పటికీ తమ గ్రామస్థులకు మెరుగైన వైద్యం అందించి మృత్యువాత పడకుండా చూడాలని గ్రామ సర్పంచ్ పంతంగి తిరుపతి జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.