తెలంగాణ

రెండు కోట్లు ఇస్తా..ఆస్తులు రాసిచ్చేయ్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఆగస్టు 16: రెండు కోట్లు ఇస్తా... మొత్తం ఆస్తులు రాసిచ్చేయ్ అని నరుూం బెదిరించాడని నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన చెన్నోజు బ్రహ్మచారి విలేఖరులకు తెలిపారు. నరుూం అరాచకాలపై, అక్రమ వసూళ్లపై భువనగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మంగళవారం ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరుూం అనుచరుడైన కత్తుల జంగయ్య తన వద్దకు వచ్చి నరుూం ముఖ్యఅనుచరుడైన పాశం శ్రీనుతో మాట్లాడించి అన్న రమ్మంటున్నాడని బెదిరించాడన్నారు. పాశం శ్రీను, షకీల్ తమను నరుూం వద్దకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో తమ కళ్లకు గంతలు కట్టి 10 కార్లను మార్చారని తెలియజేశారు. తనకు డబ్బులు అవసరమున్నాయని, 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేనిపక్షంలో తన ఇద్దరు కొడుకుల కణతలకు గన్లు పెట్టి చంపేస్తామని బెదిరించాన్నారు. దీంతో నరుూం కాళ్లవేళ్లా పడగా మొదటగా 5 కోట్లకు తగ్గి అనంతరం కనీసం 2 కోట్లు అయినా ఇవ్వాల్సిందేనని డిసైడ్ చేశాడన్నారు. తమ ఆస్తులమ్మినా 2 కోట్లు రావని తెలిపినా తాము 2 కోట్ల 10 లక్షలు ఇస్తామని, మొత్తం ఆస్తులు రాసివ్వాల్సిందిగా నరుూం బెదిరించాడని తెలిపారు. మూడు గంటలపాటు బతిమాలిన అనంతరం చివరగా 20 లక్షల రూపాయలకు ఒప్పుకుని పాశం శ్రీనుకు అప్పగించడంతో బొడుప్పల్‌లో గల తన ఇంటిని అమ్మి వారికి ఆ డబ్బులు చెల్లించామని ఆవేదనతో తెలిపారు. మొదటిసారిగా 2004 సంవత్సరంలో నరుూం తనను పిలిపించి రెండు లక్షల రూపాయలను ఇవ్వాలని, లేనిపక్షంలో తన కుమారులను చంపేస్తామని బెదిరించడంతో బతిమిలాడుకుని లక్షన్నర రూపాయలు ఆయన అనుచరుడైన షకీల్‌కు చెల్లించామని తెలిపారు. నల్లగొండ రోడ్డులోని 1-8-192 నెంబరు గల మడిగెను కూడా నరుూం అన్నకు అవసరముందంటూ నరుూం అనుచరులైన పాశం శ్రీనివాస్, షకీల్ తన కుటుంబ సభ్యులను నామరూపం లేకుండా చేస్తామని బెదిరించి మడిగెను కూడా నరుూం సహోదరి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోయారు.