తెలంగాణ

ప్రాజెక్టులను అడ్డుకుంటే జనం సహించరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఒకవైపు ప్రాజెక్టులు అడ్డుకుంటూ మరోవైపు రైతు గర్జనలా అని నిలదీశారు. మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపిలు వినోద్, కవిత, బాల్క సుమన్ వేరువేరుగా మాట్లాడారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ రైతు గర్జన నిర్వహించి టిఆర్‌ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శ చేయడాన్ని తప్పు పట్టారు. తెలంగాణలో రైతుల పరిస్థితి ఇలా ఉండడానికి కాంగ్రెస్ కారణం కాదా? అని మంత్రులు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నిర్మించని వారు, అధికారం పోయిన తరువాత ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేసే మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఒకవైపు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తారు, మరోవైపు రైతులపై ప్రేమను నటిస్తున్నారని కవిత విమర్శించారు. నిజాం సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ పాలకులు చివరకు ప్లే గ్రౌండ్‌గా మార్చేశారని హరీశ్‌రావు విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాలుగు దశాబ్దాల దిక్కుమాలిన పాలనతో రైతులను నట్టేట ముంచారని, రైతుల దీపాలు ఆర్పేశారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలంగాణ భవన్‌లో విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుంచి 2013 వరకు 23,406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, పదేళ్ల కాంగ్రెస్ దుర్మార్గపాలనకు ప్రజలు చీకొట్టి టిఆర్‌ఎస్‌ను గెలిపించారన్నారు.
మీ నిర్వాకాలు చెప్పండి
అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి రంగాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ఆ విషయాలు చెబితే బాగుంటుందని కర్నె ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో పారాల్సిన కృష్ణా జలాలు వైఎస్‌ఆర్ హయాంలో అధికార అహంకారంతో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించుకు పోతుంటే కాంగ్రెస్ నాయకులు ఇదేమీ న్యాయమని ప్రశ్నించకుండా వైఎస్‌ఆర్‌కు పళ్లాలతో హారతులు పట్టి స్వాగతాలు పలికారని ఈ ద్రోహాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో చెబితే బాగుంటుందని అన్నారు. పాలమూరు ప్రజల కడుపు గొట్టి, 15లక్షల మంది జిల్లా ప్రజలు వలసపోవడానికి కారణమైన పాపపు చరిత్ర కాంగ్రెస్‌దని అన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్ పాపపు చరిత్ర కాంగ్రెస్ దని అన్నారు. ఇవన్నీ ప్రజలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో చెబితే బాగుంటుందని సూచించారు.