తెలంగాణ

వర్షాకాలం ముగిసేలోగా లక్ష్యం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: వర్షాకాలం ముగిసేలోగా హరితహారం కార్యక్రమ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. సచివాలయం నుంచి మంగళవారం కలెక్టర్లతో రాజీవ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. థర్డ్ పార్టీతో ఎప్పటికప్పుడు తనఖీలు చేయించి లోటుపాట్లను సరిదిద్దాలని సిఎస్ సూచించారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని, శాస్ర్తియంగా పర్యవేక్షించాలని సిఎస్ ఆదేశించారు. వచ్చే ఏడాది హరితహారానికి ఎన్ని మొక్కలు అవసరం అవుతాయో అంచన వేసి నర్సరీలను పెంచాలన్నారు. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానుండటంతో దానికి అనుగుణంగా హరితహారం కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేసిన భూసేకరణ, కొనుగోలు చేసిన భూములకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించారు. భూ సేకరణ కోసం జారీ చేసిన జీవో 123పై బుధవారం కలెక్టర్లతో విధిగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు హరిత మిత్ర అవార్డు రావడం పట్ల సిఎస్ అభినందించారు.