తెలంగాణ

ప్రాణహితకు జాతీయ హోదా హుళక్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు పోటీగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో జిల్లాలు, ప్రాజెక్టుల వారీగా లెక్కలు చూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు, అవి ఏ దశలో ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రీ-డిజైన్ పేరిట చేపడుతున్న ప్రాజెక్టులు, భారీగా పెరిగిన అంచనా వ్యయాల గురించి సుదీర్ఘంగా చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించే అంశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రతిపాదన ఉంది. జాతీయహోదా లభిస్తే కేంద్రమే ఆ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని భరిస్తుంది. ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ కూడా మ్యానిఫెస్టోలో కూడా జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చినా, ఇప్పుడు కొత్త డిజైన్‌లో డిపిఆర్ పేర్కొనలేదని, అనుమతులు లేవని, దీంతో జాతీయ హోదా వచ్చే అవకాశమే లేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాణహిత-చేవెళ్ళ వర్సెస్ కాళేశ్వరం ప్రాజెక్టులో పాత డిజైన్ ప్రకారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 16.40 లక్షల ఆయకట్టు (ఎకరాలు) సాగులోకి వస్తుందని, కొత్త డిజైన్ ప్రకారం 18.07 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని ఆయన వివరించారు. పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 38,500 కోట్ల రూపాయలు కాగా, కొత్త డిజైన్‌కు ప్రభుత్వం ఏకంగా 85,000 కోట్ల రూపాయలకు పెంచిందని ఆయన విమర్శించారు.
కాళేశ్వరం రీ-డిజైన్‌లో లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం-మేడిగడ్డ వద్ద వంద మీటర్ల లెవల్‌లో బ్యారేజీ నిర్మించుకుని, ఇక్కడి నుంచే శ్రీరాం సాగర్ రెండవ దశ ఆయకట్టుకు 5 లక్షల 87 వేల ఎకరాలకు ఎల్‌ఎండి ద్వారా కాకతీయ కాలువను అనుసంధానం చేసి నీళ్ళు అందించవచ్చని అన్నారు. తుమ్మడిహట్టి నుంచి కాళేశ్వరం వరకు గల 115 కి.మీ ప్రాణహిత నదీ గర్భంలో 10 నుంచి 15 మీటర్ల నీటి నిల్వ ఎత్తు లభిస్తుంది కాబట్టి మహారాష్టత్రో సంప్రదింపులు జరిపి 4 నుంచి 5 బ్యారేజీలు నిర్మించుకోవాలని, తద్వారా జల విద్యుత్తు లభిస్తుందని చెప్పారు. తోటపల్లి రిజర్వాయర్ (1.5 టిఎంసి) రద్దు అర్థరహితమని, ఎన్నికల సమయంలో కుర్చీ వేసుకుని రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తామని వాగ్దానం చేసి మోసగించారని ఆయన కెసిఆర్‌ను విమర్శించారు.
మల్లన్న సాగర్ - మరణ సాగర్
మల్లన్న సాగర్ - మరణ సాగర్‌గా మారుతోందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొదట 1.5 టిఎంసిలు ఉన్న తడకపల్లిని, ఏకంగా 50 టిఎంసిల సామర్థ్యానికి పెంచడం వల్ల 14 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు.
25 కి.మీ పొడవుతో బ్యారేజీ నిర్మించడం మూర్ఖత్వమే అవుతుందని, పర్యావరణ ప్రమాదం, జల విధ్వంసం అవుతుందని దుయ్యబట్టారు. సామర్థ్యం పెంచడంలో అవినీతి జరిగిందని విమర్శించారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి 16 టిఎంసిల రిజర్వాయర్లు కట్టారని కెసిఆర్ తమను విమర్శించడంలో అర్థం లేదని అన్నారు. రంగారెడ్డి జిల్లా కృష్ణా బేసిన్‌లో ఉంది కాబట్టి కృష్ణా నీరే ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మంకుపట్టు పట్టడం తగదని అన్నారు. గోదావరిలో వేల టిఎంసిల నీళ్ళు సముద్రంలో కలిసి వృథా అయినా సరే కానీ రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీళ్ళు వస్తే ప్రకృతి విరుద్ధమని చెప్పడం అన్యాయమని ఆయన విమర్శించారు.