తెలంగాణ

ఎమ్సెట్-2 లీకేజి కేసులో మరొకరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్సెట్-2 పేపర్ లీక్ కేసులో మరో నిందితుడిని సిఐడి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిత్‌కుమార్ సింగ్ (28) ఢిల్లీలో ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్‌లో పనిచేస్తూ, ముకుల్ జైన్ ద్వారా వచ్చిన ఆరుగురు విద్యార్థులకు రెండు సెట్ల ఎమ్సెట్ పేపర్ల ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారు. కోల్‌కతాలో విద్యార్థులకు ధర్మ అలియాస్ ధరమ్ అలియాస్ పాజి క్యాంప్ నిర్వహించి శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో దళారి మోహిత్‌కుమార్ సింగ్‌ను అరెస్టు చేసినట్టు సిఐడి, ఐజిపి డాక్టర్ సౌమ్యమిశ్రా తెలిపారు. అదేవిధంగా పేపర్ లీక్ వ్యవహారంలో మరో ఇద్దరు నిందితులను సిఐడి గుర్తించింది. ఈ ఇద్దరు నేపాల్‌లో తరదాచుకున్నట్టు సమాచారం అందుకున్న సిఐడి బృందం వారిని అరెస్టు చేసేందుకు సిఐడి బృందం నేపాల్‌కు వెళ్లినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఎమ్సెట్-2 పేపర్ లీక్‌లో 10 మంది అరెస్టు కాగా, కీలక నిందితుల కోసం సిఐడి గాలిస్తోంది.