తెలంగాణ

ముగిసిన ఎమ్సెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణలో తీవ్ర గందరగోళం మధ్య ఎమ్సెట్ కౌనె్సలింగ్ బుధవారం నాడు ముగిసింది. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా భర్తీ అనంతరం దాదాపు 30వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. నేక్ అక్రిడిటేషన్ పొందిన కాలేజీలకు మాత్రం మంచి గిరాకీ ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ, శివారు ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు ఈసారి గిరాకీ తగ్గింది. ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకూ కాలేజీల సంఖ్యపైనా, సీట్ల సంఖ్యపైనా, అందుబాటులో ఉన్న బ్రాంచిలపైనా స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కౌనె్సలింగ్ మార్గదర్శకాలపైనా విద్యార్ధులకు స్పష్టత లేకపోవడంతో కొంత మంది తమకు వచ్చిన సీట్లను సైతం కోల్పోయారు. అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నా, రెండో దశ కౌనె్సలింగ్ అనంతరం చేరుదామని భావించిన విద్యార్థులు కాలేజీలకు రిపోర్టు చేయకపోవడం, లేదా రెండో దశలో సీటు కేటాయించినా, సరైన కాలేజీ కాకపోవడంతో తొలుత వచ్చిన సీట్లు సైతం కోల్పోయి విద్యార్ధులు లబోదిబోమన్నారు. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో 30వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి.
ఇందులో కన్వీనర్ కోటా సీట్లే 14049 ఉన్నాయి. మరో 16వేలు యాజమాన్య కోటా కింద మిగిలిపోయాయి. భర్తీ అయిన సీట్లపై నివేదికలు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి కాలేజీల యాజమాన్యానికి గడువు ఇవ్వడంతో ఖాళీలపై యాజమాన్యాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. చాలా కాలేజీల్లో సీట్లు మిగిలిపోయినా, ఆ విషయం చెబితే తమ పరువు ఎక్కడ పోతుందోనని సీట్లు మిగలలేదని చెబుతున్నాయి. అడ్మిషన్ల జాబితాలు రాగానే అసలు సంగతి తెలుస్తుందని ఉన్నత విద్యామండలికి చెందిన ఒక అధికారి చెప్పారు. కన్వీనర్ కోటాలో రెండోదశ ముగింపునాటికి 15వేలకు పైగా సీట్లు మిగిలిపోగా, స్పాట్ అడ్మిషన్లలో రెండు వేల వరకూ సీట్లు భర్తీ అయ్యాయి. మరో పక్క 1411 మంది విద్యార్థులు సీట్లను వదులుకున్నారు. తుది దశ కౌనె్సలింగ్ జరిగే సమయానికి కన్వీనర్ కోటా సీట్లు 73,604 కాగా మరో యాజమాన్య కోటాలో 38వేల సీట్లు ఉన్నాయి.
తొలి దశలో 57,940 మందికి సీట్లను కేటాయించారు. రెండో దశ కేటాయింపుల తర్వాత భర్తీ అయిన సీట్లు 58,568 మాత్రమే. తుది దశ ముగిసిన తర్వాత మిగిలిన సీట్లు 15,036 ఇవి కాకుండా మరో 15,822 మంది తమ సీట్లను స్లయిడింగ్ చేసుకున్నారు. ఇందులో ఫార్మసీ కోర్సుల్లో 2394 సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలో వంద శాతం సీట్లు నిండిన కాలేజీలు కేవలం 80 మాత్రమే కాగా, సున్నా సీట్లు భర్తీ అయిన కాలేజీలు రెండు ఉన్నాయి. మొత్తం కన్వీనర్ కోటా సీట్ల సర్దుబాటు అనంతరం స్పాట్ అడ్మిషన్లకు కాలేజీలకు 12,638 సీట్లను బదలాయించారు. కొంత మంది సీట్లను రద్దు చేసుకోవడంతో స్పాట్ అడ్మిషన్లకు 14,049 సీట్లు మిగిలాయి.