తెలంగాణ

హైదరాబాద్‌లో బ్రీడింగ్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆధునిక టెక్నాలజీతో బోవిన్ బ్రీడింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్ధ చైర్మన్ దిలీప్ రత్ తెలిపారు. దీని వల్ల ఆవులు, గేదెలకు సంబంధించి బ్రీడ్స్ పశుపోషకులకు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఇక్కడ గచ్ఛిబౌలిలో బోవిన్ బ్రీడింగ్ సెంటర్‌కు ఆయన శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ తరహా సెంటర్‌లో దేశంలో మరెక్కడా లేదన్నారు. నాణ్యమైన పశు సంతానోత్పత్తి, పోషణ, ఆరోగ్యకరమైన సేవలను అందిస్తామన్నారు. పశువుల ఉత్పాదకతను వృద్ధి చేసేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటామన్నారు. ఈ సాంకేతికతను అందుబాటు ధరల్లో ఉండే రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు. దేశంలో డెయిరీ రంగంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ సెంటర్‌ను తీర్చిదిద్దుతామన్నారు. అలాగే పాడిపరిశ్రమ ఉద్యోగులకు ఇక్కడ శిక్షణ ఇస్తామనర్నారు. అత్యాధునికత పునరుత్పత్తి సాకేతికత, ఐవిఎఫ్, ఓపియూ, ఎలైట్ జెర్మ్ ప్లాస్మ్, జెనోమిక్ ఎంపిక ఆధారిత పరిశోధలు చేపడుతామన్నారు. జన్యుపరమైన రోగాలను అరికట్టే విధంగా కొత్త బ్రీడ్స్ అభివృద్ధి జరుగుతుందన్నారు. పాడిపరిశ్రమల ప్రోత్సాహకరంగా, లాభదాయకంగా చేస్తామన్నారు.

చిత్రం.. హైదరాబాద్‌లో బుధవారం బోవిన్ బ్రీడింగ్ సెంటర్‌కు శంకుస్ధాపన చేస్తున్న ఎన్‌డిడి చైర్మన్ దిలీప్