తెలంగాణ

ఐదు గ్రామాల్లో పురావస్తు సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, ఆగస్టు 17: నల్లగొండ జిల్లా నల్లగొండ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న పురాతన సంపదను బుధవారం పురావస్తు శాఖ ఎడి నాగరాజు గుర్తించారు. మండలంలోని కంచనపల్లి, బుద్ధారం, అప్పాజిపేట, దోమలపల్లి, నర్సింగ్‌భట్ల గ్రామాలలో ఆయన పర్యటించి చారిత్రక సంపదను కనుక్కున్నారు. కంచనపల్లి గ్రామంలో సుమారు 15 ఫీట్ల పొడవు ఉన్న మెన్‌హిర్ స్మారక శిలను ఆయన సందర్శించి బృహత్ శిలాయుగపు సమాధి అని తేల్చారు. గ్రామం నడిబొడ్డున ఉన్న శిథిలమైన శివాలయాన్ని సందర్శించి ఒకేచోట దేవతామూర్తులు కొలువై ఉన్నట్లు గుర్తించారు. 12, 13 శతాబ్దాలకు సంబంధించి కాకతీయుల కాలంనాటి విగ్రహాలను కనుక్కున్నారు. బహ్మ, విష్ణువు, సూర్యదేవ, వల్లి సుబ్రహ్మణ్య, నాగదేవత, నంది విగ్రహాలుగా గుర్తించారు. అనంతరం బుద్ధారం రోడ్డు దీపకుంట సరిహద్దు వద్ద సర్వే నెం.129, 132లలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుమ్మరికుంట పాడులో తొలి చారిత్రక ఆనవాళ్లను కనుగొన్నారు. వివిధ డిజైన్లతో కూడిన ఎరుపు, నలుపు, సున్నపురాతి తదితర రంగులతో కూడిన పెంకులు లభ్యమయ్యాయి.
అదేవిధంగా అప్పాజిపేట గ్రామంలో గొర్రెబండ సమీపాన మామిండ్ల యాదయ్య చెల్కలో సుమారు 60 డాల్మిన్, కైరన్ సమాధులతో పాటు 7 ఫీట్ల పొడవున్న ఒక మెన్‌హిర్‌ను గుర్తించారు. వడ్లవారిపాడులో తొలి చారిత్రక యుగానికి చెందిన వివిధ రకాల పెంకులతో పాటు కంచుడు, పూసలు, 500 ఏళ్ల క్రితం మానవుడు ఉపయోగించిన నిజాం కాలం రాగి నాణేలు లభించాయి. దోమలపల్లి గ్రామంలో ముళ్లపొదల్లో కాకతీయుల కాలం నాటి కొన్ని విగ్రహాలు మట్టిలో కలిసిపోగా నాగదేవత, మహిషాసురమర్ధిని, విష్ణువు, సూర్యదేవ తదితర విగ్రహాలను గుర్తించారు. గ్రామం నడిబొడ్డులో ఉన్న శివాలయాన్ని సందర్శించి 11వ శతాబ్దం చాళుక్యుల కాలంనాటి పురాతన ఆలయంగా తేల్చారు. నర్సింగ్ భట్ల వెళ్లే రహదారిలో సిస్త్, వర్తులాకారపు సమాధులను గుర్తించారు. బుద్ధారం, నర్సింగ్ భట్ల గ్రామాలలో ఎలాంటి ప్రాచీన ఆనవాళ్లు కన్పించలేదు.

చిత్రం.. నల్లగొండ మండలం కంచనపల్లిలో పురాతన శివాలయాన్ని
పరిశీలిస్తున్న పురావస్తు శాఖ ఎడి నాగరాజు