తెలంగాణ

బాధ్యులపై చర్య తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఆగస్టు 17: కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి బలవన్మరణానికి బాధ్యులయన వారిని శిక్షించాలని, బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో బాధిత కుటంబసభ్యులు, స్నేహితులు, వివిధ పార్టీల నేతలు ఆందోళనకు దిగటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవే పరిస్థితులు నెలకొనగా, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షించడాన్నిబట్టి పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రితోపాటు, అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. తోటి ఉద్యోగిని కోల్పోవడం పోలీసులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మృతుడు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి స్నేహితుడు గజ్వేల్ ఎస్‌ఐ కమలాకర్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లతో ఉన్నతాధికారుల వేధింపులను పంచుకోవడం, ఎస్పీ దృష్టికి తన ఇబ్బందులను తెద్దామనుకున్నా అనుమతి దొరకకపోవడం అతన్ని తీవ్రంగా కనిచివేసిందని గుర్తుకు తెస్తుండడంతో అక్కడ చేరిన వారిని కంటతడి పెట్టింది. రెండు గంటల పాటు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో దారిపొడవునా, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తూప్రాన్, గజ్వేల్ సిఐలు రమేశ్‌బాబు, సతీష్‌లు అక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, భారీ పోలీసులు, బందోబస్తుల మధ్య రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా బక్కమంత్రగూడెం తరలించేవరకు హైడ్రామా కొనసాగింది.

చిత్రం.. గజ్వేల్‌లో ఆందోళనకు దిగిన ఎస్‌ఐ కుటుంబీకులు, స్నేహితులు, వివిధ పార్టీల నేతలు