తెలంగాణ

భక్తిపారవశ్యంలో సప్తనదుల సంగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఆగస్టు 17: ఏడునదుల సంగమమైన సోమశిలలోని ఘాట్లన్నీ, శ్రీలలిత సోమేశ్వరాలయం బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సోమశిల పరవశమైంది. ప్రభుత్వంతోపాటు జిల్లా అధికార యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ శాఖ జిల్లాలోని పుష్కరఘాట్లపై ప్రత్యేకంగా ఆప్‌ను రూపొందించి గూగుల్‌లో పెట్టడంతో వాటిలో సోమశిల క్షేత్రం, ఇక్కడి ప్రాధాన్యత, సప్తనదుల సంగమం గురించి తెలుసుకున్న వారు గూగుల్ మ్యాప్ సర్చింగ్‌తో సోమశిలకు వస్తున్నారు. సోమశిలలోని నాలుగు సాధారణ ఘాట్లు, మూడు విఐపి ఘాట్లన్నీ కూడా నిండిపోతే జనసంద్రం ఎక్కువైతే పోలీసులు పక్కనే ఉన్న మంచాలకట్ట, అమరగిరి, మల్లేశ్వరం ఘాట్లకు మల్లిస్తుంటే వారితో వాగ్వివాదానికి దిగి సోమశిలకు పోదామనే వచ్చామని, అక్కడ తప్ప మరేప్రాంతానికి వెళ్లేదిలేదంటూ చాలామంది పోలీసులతో వాగ్వివాదానికి దిగి మరీ సోమశిలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు మెదక్, నిజమాబాద్, కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సోమశిల ఆందాలను తిలకించేందుకు ప్రత్యేకంగా వస్తున్నారు.
ఉదయం వచ్చిన భక్తులు ముందుగా కృష్ణానదిలో స్నానమాచరించి, లలితసోమేశ్వరున్ని దర్శించుకున్న తరువాత అక్కడే ఉండి ప్రకృతి అందాలను చూసి తపించిపోతున్నారు. మరికొందరు సమీపంలో ఉన్న కొల్లాపూర్ కోటా, జట్‌ప్రోలు, అమరగిరి, మంచాలకట్ట, కోతిగుండు వద్ద కెఎల్‌ఐ ఎత్తిపోతల పథకం తదితర వాటిని చూసి వెళ్లుతున్నారు.
మొత్తంమీద కృష్ణాపుష్కరాలతో సోమశిలకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని చెప్పవచ్చు. రాబోయే రోజులలో ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారడం ఖాయమని చెప్పవచ్చు.

చిత్రం.. సోమశిలలోని ఘాట్‌కు వెళ్లుతున్న ప్రజలు