తెలంగాణ

జలాలపై 23న మహారాష్టత్రో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: నదీజలాల వినియోగంపై ఈ నెల 23 న మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను మీడియా ప్రతినిధులకు వివరిస్తూ, మహారాష్టత్రో కుదరబోయే ఒప్పందం చారిత్రాత్మకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమైక్యరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో పొరుగురాష్ట్రాలతో పంచాయితీలు పెట్టుకునే వారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఉంటుదని స్పష్టం చేశారు. కర్నాటకతో తాము స్నేహపూర్వకంగా ఉండటం వల్లనే ఇటీవల తాగునీటి కోసం నారాయణపూర్ నుండి ఒక టిఎంసి నీటిని మనకు ఇచ్చారన్నారు.
నదీజలాలపై గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయని కెసిఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే రెండు పర్యాయాలు చర్చలు జరిగాయన్నారు. లోయర్‌పెన్‌గంగ, మేడిగడ్డ, లెండి తదితర ప్రాజెక్టులకోసం మహారాష్టత్రో మొట్టమొదటి పర్యాయం చర్చలు జరిగాయన్నారు రెండో పర్యాయం తాను ముంబై వెళ్లిన సమయంలో అంతర్రాష్ట్ర జలాల బోర్డు ఏర్పాటైందన్నారు. ఈ బోర్డులో మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల నుండి ఐదేసి మంది మంత్రులు, ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి సభ్యులుగా ఉన్నారన్నారు. ఇప్పటికే సంయుక్తంగా సర్వేరు జరిగాయని గుర్తు చేశారు. ఇందుకు కొనసాగింపుగా ఈ నెల 23 న ఫైనల్‌గా ఒప్పందం కుదరబోతోందన్నారు. ‘మీరు బతకండి-మమ్మల్ని బతకనివ్వండి’ అన్నది తమ ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్‌తో స్నేహపూర్వకంగా ఉండటం వల్ల తెలంగాణకు 1000 మెగావాట్ల విద్యుత్తు లభిస్తోందని కెసిఆర్ గుర్తు చేశారు. కర్నాటకతో స్నేహంగా ఉండటం వల్ల ఆర్‌డిఎస్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయన్నారు. దీనివల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు లాభం చేకూరుతుందన్నారు. నదీ జలాల వినియోగంపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలపై కెసిఆర్ కనె్నర్ర చేశారు. తాను 23 న మహారాష్ట్ర వెళుతుండగా, కాంగ్రెస్ నిరసన తెలియచేయడం సబబు కాదన్నారు. సమైక్యరాష్ట్రంగా ఎపి ఉండగా కేంద్రంలో, మహారాష్ట్రంలో, ఎపిలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, మన రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క ఒప్పందం కూడా కుదుర్చుకోలేకపోయిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నిరసన వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పజలే సరైన సమయంలో సరైన జవాబు చెబుతారని అభిప్రాయపడ్డారు.