జాతీయ వార్తలు

రాష్ట్రంలో బిజెపి మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 23: తెలంగాణ విమోచన దినం వేడుకల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు బిజెపి ఆధ్యక్షుడు అమిత్ షా హైదరాబాదుకు వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. అమిత్ షా నాయకత్వంలో మంగళవారం జరిగిన రాష్ట్ర బిజెపి శాఖల కోర్ కమిటీ సభ్యుల సమావేశానంతరం లక్ష్మణ్ విలేఖరులతో మాట్లాడారు. సెప్టెంబర్ 17 తేదీ తెలంగాణ విమోచన దినం తమ పార్టీకి ఎంతో ముఖ్యమని తెలిపారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం ఒక సంవత్సరం తరువాత సెప్టెంబర్ 17న స్వాతంత్రం లభించిందని, అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ చొరవ మూలంగా జరిగిన పోలీసు ఆక్షన్ ద్వారా తెలంగాణ నిజాం పాలన, రజాకార్ల దురాగతాల నుండి విముక్తి పొందిందని అన్నారు. ఇంత ఘన చరిత్ర కలిగిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైందని వివరించారు. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకసారి, అమిత్ షా రెండు సార్లు హైదరాబాదులో పర్యటించినప్పుడు తెలంగాణలో పార్టీని పటిష్టం చేయటంపై ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. వాటి ప్రకారమే ఈ రాష్ట్రంలో బిజెపిని పటిష్టం చేస్తున్నామన్నారు. తెలంగాణ విమోచన దినం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న విషయమన్నారు.నిజాం నవాబు పాలనలో రజాకార్లు చేసిన దురాగతాలకు సంబంధించిన అన్ని వివరాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతో ఉందని లక్ష్మణ్ తెలిపారు.
రాష్ట్రానికి మేలు చేస్తే ప్రోత్సాహం:కిషన్
మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకునే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి ఉంటే బావుండేదని రాష్ట్ర బిజెపి సీనియర్ నేత,శాసన సభ్యుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మేలు చేసే అన్ని కార్యక్రమాలను తమ పార్టీ బలపరుస్తుందని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడం, ఎన్‌డిఏ పథకాల ఫలితాలను ప్రజలకు అందించడం, ఈ నెల 25 నుంచి పండిట్ దీన్ దయాళ్ శత జయంతి ఉత్సవాల నిర్వహణపై నేటి సమావేశంలో చర్చంచామని తెలిపారు. బిజెపి నేషనల్ కౌన్సిల్ సమావేశాలు కాలికట్‌లో ఈనెల 25 ప్రారంభమవుతాయన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు.