తెలంగాణ

లోపం ఎక్కడుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఘోర పరాజయంతో షాక్‌కు గురైన కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. లోపం ఎక్కడ ఉందో అనే అంశంపై విశే్లషించడానికి ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్ఠానం రాష్ట్రానికి చెందిన ముగ్గురు నాయకులను ఆదేశించింది. టిపిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీని హుటాహుటిన తరలి రావాల్సిందిగా సూచించింది. ఈ మేరకు వారు సోమవారం ఉదయం హస్తినకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్దకు దిగ్విజయ్ సింగ్ వారిని తీసుకెళ్ళనున్నట్లు సమాచారం. అయితే ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు ఇప్పటివరకు అప్పాయింట్‌మెంట్ దొరకలేదని సమాచారం. వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది?, కనీసం డిపాజిట్ కూడా ఎందుకు రాలేదు?, లోపం ఎక్కడ ఉంది? అనే అంశాలపై అధిష్ఠానం ఆరా తీయనున్నది. స్థానిక సంస్ధల కోటా నుంచి 12 ఎమ్మెల్సీలకు జరగబోయే ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు, నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక తదితర అంశాలపైనా అధిష్ఠానం వారితో చర్చించనున్నది.
వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, పార్టీ విజయం సాధించేందుకు విజయవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నేతలు ముందు నివేదిక ఇచ్చి, తీరా ఎన్నికల్లో బొక్కబోర్లాపడటం అధిష్ఠానానికి మింగుడు పడటం లేదు. కేంద్ర మాజీ మంత్రులను ప్రచారం కోసం పంపించినా కనీసం డిపాజిట్ కూడా రాకపోవడమేమిటని ఇప్పటికే సోనియా గాంధీ దిగ్విజయ్‌ను ఆరా తీసినట్టు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్ దక్కిందని, ఇప్పుడు వరంగల్‌లో డిపాజిట్ ఎందుకు దక్కలేదని ప్రశ్నించనున్నది. నాటికి, నేటికి కాంగ్రెస్ బలపడిందా?, బలహీనపడిందా? లేక రాష్ట్ర ప్రభుత్వం పని తీరు బాగుందని ప్రజలు సర్ట్ఫికేట్ ఇచ్చారా? అని అధిష్ఠానం క్లాసు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.