తెలంగాణ

చేతిరాత భగవద్గీత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 24: కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణానికి చెందిన బొలసాని అంజిబాబు వృత్తిరీత్యా ప్రింటింగ్ ప్రెస్‌ను నిర్వహిస్తున్నారు. ముద్రణ రంగంలో చాలాకాలం పాటు పనిచేసిన ఆయన తెలుగు భాషా వినియోగం తగ్గుతోందని చేతిరాత, తెలుగు భాషా మాధుర్యం ఈతరానికి దక్కడం లేదని అరచేతిలో ఇమిడే భగవద్గీతను రూపొందించారు. ఈ క్రమంలోనే చేతిరాతతో అరచేతిలో ఇమిడే భగద్గీతను తయారు చేసి అందులో 725 పేజీల్లో 701 శ్లోకాలు, లలిత, విష్ణు, శివ సహస్రనామాలతో పాటు హనుమాన్ చాలీసాలోని శ్లోకాలు, అష్టోత్తరాలతో అగ్గిపెట్టే సైజులో భగవద్గీతను రూపొందించాడు. అయితే ఇదంతా భక్త్భివంతో పాటు చేతిరాత, తెలుగుపై ఉన్న అభిమానంతో ఈ బుల్లి భగవద్గీతను రూపొందించి చేతి రాతపై తనకున్న మక్కువను చాటుకున్నాడు. చేతిరాత, మాతృభాష కమ్మదనాన్ని కొంతమందికైనా తెలియచేసేందుకు తాను ఈ ప్రయోగాన్ని ఎంచుకున్నట్లు అంజిబాబు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు పరంధాములు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను రూపొందించగా, అదే స్ఫూర్తితో తాను భగవద్గీత పుస్తకాన్ని తయారు చేసేందుకు సన్నద్ధమైనట్లు ఆయన వివరించారు.

అగ్గిపెట్టె సైజులో, అరచేతిలో ఇమిడేలా చేతిరాతతో
భగవద్గీతను
రూపొందించిన అంజిబాబు