తెలంగాణ

కొంచెం తిక్కున్న పవన్‌కు కెసిఆర్ చుక్కలు చూపించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌దే విజయం అని ఎంపి కవిత పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశం శనివారం తెలంగాణ భవన్‌లో జరిగింది. నిజామాబాద్ నాయకులతో ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ఓటర్ల కోసం బిజెపి-టిడిపి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ప్రచారంలో దింపుతున్నామని చెప్పాయని, కొంచం తిక్కున్న పవన్‌కు మన ముఖ్యమంత్రి కెసిఆర్ ఏనాడో చుక్కలు చూపించారని , మనం భయపడాల్సిన పనిలేదు, ప్రచారానికి మేకప్‌తో వచ్చే పవన్ కళ్యాణ్ ఎన్నికలయ్యాక ప్యాకప్ చెప్పేస్తాడని అన్నారు. హైదరాబాద్ కోసం 20వేల కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకువస్తే నేను కూడా బిజెపికే ఓటు వేస్తానని చెపితే దీనిపై బిజెపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. జాతీయ రహదారులకు కేటాయించిన నిధులను ప్రస్తావించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఇప్పటివరకు ఎన్నో పార్టీలకు జిహెచ్‌ఎంసిని అప్పగించారు, ఒకసారి టిఆర్‌ఎస్‌కు అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వద్ద ఎన్నో ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, జగిత్యాల ఇన్‌చార్జ్ డాక్టర్ సంజయ్, నిజామాబాద్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
గుజరాతీ గర్భాలో కవిత
హైదరాబాద్ భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమని కవిత తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం గుజరాతీ పటేల్ గర్భా కార్యక్రమంలో కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంలో భాషలు, ప్రాంతాలు వేరయినా పండుగలు ఆచార వ్యవహారాల్లో సారూప్యత ఉందని అన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ మాదిరిగానే గుజరాత్‌లో గర్భా నిర్వహిస్తారని అన్నారు. రామసేతు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కవితకు బుల్లెట్ ప్రూఫ్ కారు
కవితకు తెలంగాణ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. భద్రత కారణాల వల్లే ఎంపి కవితకు బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుండగా సిఎం కుమార్తె అయినందుకే ఆమెకు బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ భవన్‌లో శనివారం నిజామాబాద్ జిల్లా నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న కవిత

నియమావళి ఉల్లంఘన
తెరాసపై ఎన్నికల అధికారికి టిడిపి ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: టిఆర్‌ఎస్ నాయకులు యదేచ్చగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రసంగాలు చేస్తున్నారని టి.టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం. అమర్‌నాథ్ బాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేయడంతోనే ఎన్నికల ‘కోడ్’ అమల్లోకి వచ్చిందని మీరు ప్రకటించినా మంత్రులు ఇష్టారాజ్యంగా ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎలక్ట్రిక్, టెలిఫోన్ స్తంభాలు, ఫ్లై-వోవర్లకు, మెట్రోరైల్ పిల్లర్లకు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా టిఆర్‌ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు.
బాబు సంస్కరణల వల్లే
ఉచిత విద్యుత్ సాధ్యమైంది
టి.టిడిపి అధ్యక్షుడు రమణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విద్యుత్తు రంగంలో తీసుకుని వచ్చిన సంస్కరణల వల్లే ఉచిత విద్యుత్తు సాధ్యమైందని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. తెలుగునాడు విద్యుత్తు కార్మిక సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం పార్టీ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో జరిగింది. ఈ కార్యక్రమంలో రమణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇ. పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్. రమణ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు కార్మికులను, ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం లోపాయికారి విద్యుత్తు కొనుగోళ్ళ వల్ల విద్యుత్తు సంస్ధలకు నష్టం జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

12న టిడిపి బహిరంగ సభ
హాజరుకానున్న చంద్రబాబు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఈ నెల 12న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ సభకు టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. టిడిపి-బిజెపి నాయకులు సీట్ల సర్దుబాటు కోసం శనివారం సమావేశమయ్యారు. అయితే ఇరు పార్టీలకు ఆశావాహుల నుంచి ఇంకా దరఖాస్తులు వస్తున్నందున మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఇలాఉండగా ఈ నెల 12వ తేదీన నిర్వహించబోయే బహిరంగ సభకు రావాల్సిందిగా టిడిపి నాయకులు బిజెపి నాయకులను ఆహ్వానించారు.
12న దిగ్విజయ్ సింగ్ రాక
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం ఏర్పాట్లు, అభ్యర్థుల ఎంపికకు పార్టీ తీసుకుంటున్న చర్యల గురించి పరిశీలించేందుకు ఎఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు.

ప్రభుత్వానివి మాఫియా చేష్టలు

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: రాష్ట్ర ప్రభుత్వం మాఫియాలా పని చేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల నిర్వహించిన ఛండీయాగానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఛండీయాగానికి 7 కోట్ల విరాళాలు వచ్చాయని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినందున, ఆ విరాళాల వివరాలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. విరాళాలను టిఆర్‌ఎస్ అధ్యక్షునిగా స్వీకరించారా? ముఖ్యమంత్రి హోదాలో స్వీకరించారా? ఐటి శాఖకు తెలియజేశారా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా తీసుకుంటే తప్పనిసరిగా సిఎం సహాయ నిధి నుంచే బయటకు రావాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయింది కానీ టిఆర్‌ఎస్ ఆదాయం పెరిగిందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో బ్యానర్లు, కటౌట్లు పెట్టరాదన్న హైకోర్టు ఉత్తర్వు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పేరిట పెద్దఎత్తున వెలిసాయని అన్నారు. మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైటెక్ సిటీని నిర్మించినట్లు ఆ ఫొటోతో ఫ్లెక్సీలు వేయించుకున్నారని ఆయన తెలిపారు.
ముస్లింలను అవమానిస్తున్నారు
అసదుద్దీన్ ఒవైసీ తలపై ధరించిన టోపీపై ముఖ్యమంత్రి కెసిఆర్ కాలు పెట్టినట్లు ఫ్లెక్సీలు ఒకదానిపై ఒకటి ఉండడం ముస్లిం మతాన్ని అవమానించినట్లే అవుతుందని షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. లక్‌డీకాపూల్‌లో టిఆర్‌ఎస్ పెట్టిన ఫ్లెక్సీలో కెసిఆర్ నడుస్తున్న ఫొటో ఉందని, ఆ ఫ్లెక్సీ కింద మజ్లీస్ పార్టీ పెట్టిన ఫ్లెక్సీలో అసదుద్దీన్ ఒవైసీ ఫొటో ఉందని ఆయన ఆ ఫ్లెక్సీల ఫొటోలను మీడియాకు చూపించారు. టిఆర్‌ఎస్‌కు మజ్లీస్ తొత్తుగా మారిందని ఆయన విమర్శించారు.

తరలింపు తలనొప్పి

కొలిక్కిరాని సిబ్బంది వ్యవహారం
విభజనపై ఏపీ సర్కారు కసరత్తు
జూన్‌నాటికి మార్పు కనిపించేనా?

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనను 2016 జూన్ తర్వాత విజయవాడ నుంచి కొనసాగించాలని సిఎం చంద్రబాబు ఒకవైపు ప్రయత్నిస్తుంటే, ఉద్యోగుల విభజన ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఉద్యోగులకు సంబంధించి తాత్కాలిక విభజన జరిగినప్పటికీ, శాశ్వత ప్రాతిపదికన విభజన పూర్తికావాల్సి ఉంది. శాశ్వత ప్రాతిపదికన విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) అనుమతించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిగాని, తెలంగాణ రాష్ట్రానికిగానీ డిఓపిటి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. డిఓపిటి అనుమతిస్తే ఉద్యోగుల ప్రమోన్లకు మార్గం సుగమమవుతుంది. అయితే ఇది అనేక చిక్కులతో ముడిపడి ఉండటం వల్ల కొరకరాని కొయ్యగా మారింది. ఉద్యోగుల విభజన, పరిపాలనను విజయవాడ నుండి కొనసాగించే విషయంలో ప్రభుత్వపరంగా ప్రయత్నాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అనేక పర్యాయాలు సిఆర్ కమలనాథన్ (కమలనాథన్ కమిటీ)తో సమావేశమై వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగుల వివరాలు అందించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోనూ కృష్ణారావు భేటీ అయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజన కూడా 58:42 శాతం చొప్పున జరగాలని నిర్ణయించారు. దాదాపు అన్ని శాఖల్లోనూ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయడంలోనే విఘ్నాలు ఏర్పడుతున్నాయి. సిఆర్ కమలనాథన్ కమిటీ వద్ద అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరిగింది. తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఏపీ ప్రభుత్వంలోనూ, ఏపీకి చెందిన ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలోనూ నేటికీ పనిచేస్తున్నారు. ఇటీవల విజయవాడకు వెళ్లిన ఉద్యోగుల్లో తెలంగాణకు చెందినవారు చాలామంది ఉన్నారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరగకపోవడం వల్ల, విధిలేని పరిస్థితిలోనే వీరు విజయవాడలో పనిచేస్తున్నారు. అదే సమయంలో ఏపీకి చెందిన ఉద్యోగుల్లో సీనియర్లు విజయవాడ వెళ్లేందుకు పెద్దగా సుముఖత చూపడం లేదు. శాశ్వత ప్రాతిపదికన విభజన జరిగితే ఏపీలో పనిచేస్తున్న వారిలో 58శాతం కంటే ఎక్కువమంది ఉంటే వారిలో జూనియర్లను తెలంగాణ ప్రభుత్వానికి పంపించేందుకు వీలుంటుంది. ఇప్పటి వరకు సీనియారిటీ జాబితా రూపొందించకపోవడం వల్ల సమస్య ఉత్పన్నమవుతోంది.
అలాగే హైదరాబాద్‌లో ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతరుల (ఏపీకి చెందినవారు) పిల్లల విషయంలో తలెత్తుతున్న ‘స్థానికత’ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. స్థానికత విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్టప్రతి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు రాష్టప్రతి నుండి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడలేదు. ఈ పరిస్థితిలో ఎపి రాష్ట్ర ప్రభుత్వం స్థానికత విషయంలో ఎలాంటి జీఓ జారీ చేసినా, న్యాయస్థానాల్లో నిలిచే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. జోనల్ పోస్టుల్లో పనిచేస్తున్న వారి విషయంలో కూడా ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. గతంలో డివిజనల్ స్థాయి పోస్టుల (ఆర్‌డిఓ తదితర పోస్టులు) భర్తీలో అనేక అక్రమాలు జరిగాయి. డైరెక్ట్ రిక్రూటీల పోస్టుల్లో కూడా ప్రమోషన్లపై వచ్చిన వారు కొనసాగుతున్నారు. అలాంటి పోస్టుల విషయంలో అనేక శాఖల్లో చట్టపరంగా కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులు నేటికీ కోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్ సమస్యలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా 2016 జూన్ తర్వాత రాష్ట్ర పరిపాలనను విజయవాడ నుండి కొనసాగించడంలో చిక్కులు ఏర్పడతాయని న్యాయశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.