తెలంగాణ

జిఎస్టీతో మేలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: వస్తు సేవా పన్ను (జిఎస్టీ) విధానంతో అన్ని రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని, సంస్కరణలతో కేంద్ర, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని సిఎం చంద్రశేఖర్ రావు చెప్పారు. జిఎస్టీ సరిగా అమలయ్యేలా చూస్తామంటూనే, రాష్ట్రానికి వచ్చే లబ్ధి విషయంలో అప్రమత్తమై కేంద్రం నుంచి రావాల్సిందంతా రాబడతామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వస్తు సేవా బిల్లును సమర్ధించాయని, ఏ రాష్ట్రం కూడా తన ప్రయోజనాలను వదులుకునేందుకు సిద్ధంగా ఉండదన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన 2014 రాజ్యాంగపు 12వ సవరణ బిల్లు వస్తు సేవా పన్నుకు మంగళవారం శాసన సభ, శాసన మండలి మద్దతిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. బిల్లును సిఎం కెసిఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ బిల్లువల్ల రాష్ట్రాలకు నష్టం వస్తే ఐదేళ్లపాటు సగపాలును భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈ అంశాన్నీ రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చారన్నారు. ఈ బిల్లుతో వస్తు సేవా పన్ను విధానం అమల్లోకి రాదన్నారు. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలు బిల్లును ఆమోదించిన తర్వాత కేంద్రం జిఎస్టీ మండలిని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇందులో అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు, అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. ఆ మండలి వస్తు సేవా పన్నుపై ముసాయిదా రూపొందించి పార్లమెంటు ఆమోదానికి పంపుతుందన్నారు. ఆ బిల్లును రాష్ట్రాలు మళ్లీ ఆమోదించాల్సి ఉందన్నారు. పన్నుల ఎగవేతను నియంత్రించి, ఆదాయం పెంచడమే జిఎస్టీ ఉద్దేశమన్నారు. తెలంగాణలో సేవా పన్ను ఆదాయం ఎక్కువన్నారు. గత ఏడాది రాష్ట్రంలో పన్నుల ఆదాయం 31,117 కోట్లు వచ్చిందన్నారు. పెట్రోలియం ఉత్పత్తులకు జిఎస్‌టి వర్తించదన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కేంద్రం, రాష్ట్రాలు వస్తు సేవా పన్నువైపు మొగ్గు చూపుతున్నట్టు వివరించారు. యూపీఏ ప్రభుత్వం సెంట్రల్ సేల్స్ ట్యాక్స్‌ను 7నుంచి 2 శాతానికి తగ్గించాలని రాష్ట్రాలను 2007లో ఆదేశించిందన్నారు. దీనివల్ల వచ్చే నష్టాన్ని కేంద్రం భరిస్తుందని గతంలో చెప్పి అమలు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం నుంచి రూ.10440కోట్లు ఈ ఖాతా కింద రాష్ట్రానికి రావాల్సి ఉన్న విషయాన్ని గ్రహించినట్టు చెప్పారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.1700 కోట్లు ఇచ్చిందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతివ్వడం శుభపరిణామంగా కెసిఆర్ అభివర్ణించారు. దేశంలో ఇంతవరకు 9 రాష్ట్రాలు బిల్లుకు మద్దతిస్తూ తీర్మానం చేశాయని, బిల్లును ఆమోదించం ద్వారా తెలంగాణ పదో రాష్ట్రంగా చరిత్రలోకి ఎక్కిందన్నారు. జిఎస్టీ బిల్లు గొప్ప ఆర్ధిక సంస్కరణగా ఆయన అభివర్ణించారు. జిఎస్టీ బిల్లు కోసమే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశామని సిఎం కెసిఆర్ వివరించారు.

చిత్రం... స్పీకర్ అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో మాట్లాడుతున్న కెసిఆర్