తెలంగాణ

ఉభయ సభలు నిరవధిక వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమైన ఒక రోజు అసెంబ్లీ ముగిసింది. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశమైన శాసనసభ జిఎస్‌టి బిల్లుకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేయడంతో పాటు మూడు బిల్లుల ఆమోదం తరువాత మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు స్పీకర్ మధుసూదనాచారి నిరవధిక వాయిదా వేశారు. ఉభయ సభల్లోనూ మూడు బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు. తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థల, ధర్మాదాయాల బిల్లు, తెలంగాణ పన్ను విధింపు బిల్లు, సైబరాబాద్ పోలీసు సవరణ బిల్లులను సభ ఆమోదించింది. దేవాలయాల పాలక మండలి నియామకంలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి కోరారు. కోటి రూపాయల ఆదాయం ఉన్న ఆలయాలకు ప్రస్తుతం ఉన్న ట్రస్ట్ సభ్యుల సంఖ్య తొమ్మిది నుంచి 14కు పెంచారు. అదే విధంగా కోటి రూపాయలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలకు సైతం సభ్యుల సంఖ్యను 14కు పెంచుతూ సవరణ చేశారు. రాజకీయ నిరుద్యోగులకే కాంగ్రెస్ హయాంలో ట్రస్టులో స్థానం కల్పించారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సిజిఎఫ్‌లో నిధులు లేకపోయినా దాదాపు ఐదేళ్ల కాలానికి సరిపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనివల్ల కొత్తగా సిజిఎఫ్ కింద నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుని, పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని, స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చిందని విమర్శించడంతో అధికార పక్షం సభ్యులు అడ్డుకున్నారు. బిల్లుకు సంబంధించిన అంశానికే పరిమితం కావాలని స్పీకర్ మధుసూధనాచారి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి సూచించారు. మూడు బిల్లుల ఆమోదం తరువాత స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. శాసన మండలిలోనూ ఈ మూడు బిల్లులను ఆమోదించిన తరువాత మండలి చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.
మండలి నుంచి కాంగ్రెస్ వాకౌట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాభావం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, అందువల్ల కరవు పరిస్థితిపై చర్చకు అనుమతించాలంటూ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తూ, సభ నుండి వాకౌట్ చేసింది. జిఎస్‌టి బిల్లుకు మద్ధతు తెలియచేస్తూ, ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానంపై చర్చించేందుకు మంగళవారం సమావేశమైన శాసనమండలిలో తొలుత కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. కాంగ్రెస్ పక్షం నాయకుడు మహమ్మద్ అలీ షబ్బీర్ తొలుత మాట్లాడుతూ, జిఎస్‌టి బిల్లుకు కాంగ్రెస్ మద్ధతు తెలియచేస్తోందని, అయితే ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా కరవు పరిస్థితి వల్ల రైతులు నష్టానికి గురవుతున్నారని తెలిపారు. ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి, తక్షణమే కరవుపై చర్చించేందుకు అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఏ పరిస్థితిలోనైనా రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. జిఎస్‌టి బిల్లుకు మద్ధతు తెలియచేస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించామని దాన్ని తొలుత ఆమోదించాల్సి ఉందన్నారు. ఈ సమయంలో కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కాంగ్రెస్ సభ్యులను వారిస్తూ, కరవు పరిస్థితిపై చర్చించేందుకు తర్వాత అనుమతి ఇస్తానని, తొలుత జిఎస్‌టి బిల్లును పూర్తిచేసుకుందామని సూచించారు. అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంలోకి దూసుకువెళ్లారు. పోడియంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. కరవుపై చర్చకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, సభ నుండి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జిఎస్‌టి బిల్లుకు సంబంధించిన తీర్మానాన్ని సభ చర్చకు చేపట్టింది.
‘కాంగ్రెస్‌కు ఎన్ని నాలుకలు?’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 30: మహారాష్టత్రో జరిగిన ఒప్పందాలపై కాంగ్రెస్ నాయకులు మండలానికో మాట, జిల్లాకో మాట, రాష్ట్రానికో మాట మాట్లాడుతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శాసన మండలి సమావేశం అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ రాష్ట్రానికో విధానాన్ని అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. తాజా ఒప్పందాలతో తెలంగాణకు లాభం జరిగి మహారాష్టక్రు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన చేస్తోందని హరీశ్‌రావు తెలిపారు. ఈ ఒప్పందాల వల్ల తెలంగాణకు మేలు జరిగి ఏపికి అన్యాయం జరుగుతోందని ఏపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టిందని చెప్పారు. ఈ ఒప్పందాల వల్ల తెలంగాణ ప్రయోజనాలు మహారాష్టక్రు తాకట్టు పెట్టారని తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్నారని, ఒకే పార్టీ ఇన్ని రకాల వాదనలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని విమర్శించారు.