తెలంగాణ

పులిచింతల గేట్లు ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30:వరద ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని పులిచింతల గేట్లు వెంటనే ఎత్తి వేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావును కోరారు. మంగళవారం ఈ మేరకు ఫోన్ చేసి మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల నల్లగొండ జిల్లాలోని పలు గ్రామాలు ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయి. ఈ గ్రామాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నిధులు మంజూరు చేయకపోవడం వల్ల పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదని వెంటనే నిధులు విడుదల చేయాలని ఆరునెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి స్పందన లేదు. పులిచింతల ప్రాజెక్టు కింద నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదని హరీశ్‌రావు దేవినేని ఉమకు తెలిపారు. పులిచింతలకు వస్తున్న వరద నీటిపై మంత్రి సమీక్షించారు. నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్, ఇఎన్‌సి ఇతర ఉన్నతాధికారులతో హరీశ్‌రావు మాట్లడారు.