తెలంగాణ

జిఎస్‌టికి మండలి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుపై ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానాన్ని తెలంగాణ శాసనమండలి మంగళవారం ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదం పొందిన జిఎస్‌టి బిల్లును దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు 50 శాతంపైగా రాష్ట్ర శాసనసభలు / శాసనమండళ్లు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తన అంగీకారం తెలుపుతూ పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చింది. తెలంగాణ శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వం తరఫున జిఎస్‌టి బిల్లుకు మద్దతు తెలియచేస్తూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘్భరత రాజ్యాంగానికి 122వ సవరణ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన జిఎస్‌టి బిల్లును ఈ సభ ఆమోదిస్తోంది’ అంటూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. సవివరమైన చర్చ అనంతరం బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
లాభనష్టాలపై బేరీజు వేయలేదు: ప్రభుత్వం
జిఎస్‌టి అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభమా, నష్టమా అన్న అంశంపై బేరీజు వేయలేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున జిఎస్‌టికి సంబంధించి రూపొందించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతూ, 2015-16 సంవత్సరానికి రాష్ట్ర సొంత పన్నుల ద్వారా 31,117 కోట్ల రూపాయలు వస్తాయని అంచనావేశామన్నారు. ప్రొఫెషనల్ టాక్స్ 386 కోట్లు మినహాయిస్తే, ఇతర పన్నులు 30,731 కోట్ల రూపాయలని తెలిపారు. మద్యంపై పన్ను, పెట్రోల్, పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలో చేర్చకపోవడం వల్ల ఈ రెండు రకాల పన్నుల ద్వారా 14,654 కోట్ల రూపాయలు లభిస్తాయన్నారు. అందువల్ల ఈ రెండు రకాల పన్నులను మినహాయిస్తే, 16,077 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యాట్, సేల్స్‌టాక్స్, పర్చేజ్ ట్యాక్స్, ఎంట్రీటాక్స్, సర్‌చార్జ్, సెస్ తదితర పన్నులన్నీ జిఎస్‌టి పరిధిలోకి వస్తాయన్నారు. జిఎస్‌టి అమల్లోకి వస్తే ఇప్పటికే పన్నుల రూపంలో లభిస్తున్న నిధులకు సమానంగా కేంద్రం నుండి నిధులు లభిస్తాయా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా సేవాపన్నుల ద్వారా కేంద్రానికి మన రాష్ట్రం నుండి ఎనిమిదివేల కోట్ల రూపాయలు లభిస్తున్నాయని, జిఎస్‌టి అమల్లోకి వస్తే ఈ మొత్తంలో 50 శాతం అంటే దాదాపు నాలుగువేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజనాకు చేరుతుందని స్పష్టం చేశారు. మొత్తంమీద జిఎస్‌టి అమల్లోకి వస్తే ఉత్పత్తిదారులు, వినియోగదారులకు లబ్ది చేకూరుతుందని కడియం స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రానికి గతం కంటే ఆదాయం తగ్గితే ఐదేళ్ల వరకు ఈ నష్టాన్ని భర్తీ చేస్తామని కేంద్రం చట్టంలోనే హామీ ఇచ్చిందని కడియం గుర్తు చేశారు. జిఎస్‌టి అంశాలపై చర్చించేందుకు ఏర్పాటయ్యే ఉన్నతస్థాయి కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారని, ఈ కౌన్సిల్ తరచూ సమావేశమై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని వివరించారు. కాగా, జిఎస్‌టి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలియచేస్తోందని, అయితే దీనిపై కొన్ని అనుమానాలున్నాయని కాంగ్రెస్ పక్షం తరఫున పి. సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా వివరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐటి రంగానికి కొన్ని ఇబ్బందులు వస్తాయన్న అనుమానాలున్నాయని, జిఎస్‌టి బిల్లును మరింత పటిష్టంగా రూపొందిస్తే బాగుండేదన్నారు.