బిజినెస్

పడకేసిన ఆర్థిక ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ జిడిపి వృద్ధిరేటు 6 త్రైమాసికాల కనిష్టానికి పతనమైంది. 7.1 శాతంగా నమోదైంది. 2014-15 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్‌లో 6.6 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ దరిదాపుల్లోకి వృద్ధిరేటు ఇప్పుడే దిగజారింది. మరోవైపు వౌలికరంగ ప్రగతి జూలై నెలలో 3.2 శాతానికి దిగజారింది. అంతకుముందు నెల జూన్‌లో 5.2 శాతంగా నమోదవడం గమనార్హం. బొగ్గు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాల పనితీరు పేలవంగా ఉండటమే ఇందుకు కారణం. కాగా, మైనింగ్, నిర్మాణ, వ్యవసాయ రంగాల్లో చోటుచేసుకున్న మందగమనంతో ఆర్థిక వృద్ధిరేటు ఆరు త్రైమాసికాల కనిష్టాన్ని తాకిందని బుధవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.5 శాతంగా ఉండగా, ఈ ఏడాది జనవరి-మార్చిలోనైతే ఏకంగా 7.9 శాతానికి ఎగిసింది. అయితే ఈ ఏడాది 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుతో సబ్సిడీ భారం పెరిగిపోయిందని, ఈ ప్రభావం తాజా జిడిపి గణాంకాలపై ప్రస్ఫుటంగా కనిపించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్న విస్తృత వర్షపాతంతో మున్ముందు జిడిపి గణాంకాలు బాగుంటాయన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఇక్కడ విలేఖరుల వద్ద వ్యక్తం చేశారు.