తెలంగాణ

విత్తన ఉత్పత్తిపై అమెరికా విశ్వవిద్యాలయంతో ఒప్పందం: పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని నాణ్యమైన విత్తన ఉత్పత్తి కేంద్రంగా తయారు చేసేందుకు, రైతులకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అమెరికాలోని ఐఓవా రాష్ట్ర రాజధాని డేస్ మెయిన్స్ పట్టణంలోని ఐఓవా రాష్ట్ర విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ డీన్ జాతీయ విత్తన కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్ మంజిత్ మిశ్రా తో కలిసి వ్యవసాయ విత్తన ఉత్పత్తి అభివృద్ధికి ఒప్పందాలపై చర్చించారు. తెలంగాణలో జాతీయ విత్తన కేంల ఎక్స్‌చేంజ్ ప్రొగ్రామ్ , రాష్టంలో విత్తన పరీక్ష ప్రయోగ శాలల సిబ్బంది కి ఐఓవా లోని జాతీయ విత్తన కేంద్రంలో శిక్షణ వంటి అంశాలపై ఒప్పందానికి చర్చించారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన, తొలి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రఖ్యాతి చెందిన ఐఓవా రాష్ట్ర విద్యాలయం సందర్శించి తెలంగాణలో విత్తన ఉత్పత్తికి రైతులకు ఉపయోగపడే అంశాలపై చర్చించినట్టు చెప్పా రు,