తెలంగాణ

జెఎన్‌టియుహెచ్ పరీక్షలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్త బంద్‌కు ట్రేడ్ యూనియన్లు పిలుపునివ్వడంతో జెఎన్‌టియు హెచ్ శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. అదే విధంగా తెలంగాణలో పలు పాఠశాలలు, విద్యాసంస్థలు శుక్రవారం నాడు సెలవు ప్రకటించాయి. పలు విశ్వవిద్యాలయాలు పరీక్షలను రీ షెడ్యూలు చేశాయి. జెఎన్‌టియుహెచ్ శుక్రవారం నిర్వహించాల్సిన ఎంబిఎ రెండో సెమిస్టర్, ఎంసిఎ రెండో సెమిస్టర్, ఎంబిఎ మొదటి సెమిస్టర్, ఎంసిఎ మొదటి సెమిస్టర్ పరీక్షలను 16వ తేదీకి వాయిదా వేసిందని ఇవాల్యూషన్ డైరెక్టర్ డాక్టర్ బి ఆంజనేయ ప్రసాద్ చెప్పారు. అలాగే ఫస్టియర్ బిటెక్ పరీక్షలను, ఫస్టియర్ బి ఫార్మసీ పరీక్షలను 13వ తేదీకి వాయిదా వేశామని ఆయన వివరించారు. ఎన్‌టిఎస్‌ఇ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ వరకూ గడువు పొడిగించినట్టు పాఠశాల విద్యా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా డిఇడి రెండో సంవత్సరం పరీక్షలకు సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్ 15లోగా దరఖాస్తులు సమర్పించాలని, 50 రూపాయిల జరిమానాతో 22వ తేదీలోగా దరఖాస్తులు పంపంచాలని పరీక్షల డైరెక్టర్ వి ఎస్ భార్గవ తెలిపారు.