తెలంగాణ

వర్షాల పరిస్థితి పరిశీలనకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాల మూలంగా కురుస్తున్న వర్షం, ప్రధాన నదుల్లో నీటిప్రవాహాలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసేందుకు అధికారులతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ కమిషనర్, ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. ప్రదీప్ చంద్ర పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ 1 న ప్రారంభమైన నైరుతీ రుతుపవనాలు సెప్టెంబర్ 30 వరకు ఉంటాయి. ఐఎండి హైదరాబాద్ డైరెక్టర్, ఆర్థిక గణాంకాల శాఖ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ నేషనల్ రీమోట్ సెన్సింగ్ సెంటర్ (బాలానగర్) డైరెక్టర్, వ్యవసాయ శాఖ అడినల్ డైరెక్టర్-2,సభ్యులుగా ఉండే ఈ కమిటీకి విపత్తుల నిర్వహణ కమిషనర్ మెంబర్-కన్వీనర్‌గా వ్యవసహరిస్తారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒక పర్యాయం సమావేశమై వర్షాల పరిస్థితి, నదులలో నీటి ప్రవాహం తదితర అంశాలపై సమీక్షిస్తుంది. కమిటీ తన నివేదికను, తన సిఫార్సులతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.