తెలంగాణ

టిపిసిసి ఎస్సీ విభాగం విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: టిపిసిసి ఎస్సీ విభాగం విస్తరణకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదముద్ర వేశారు. ఐదుగురు వైస్‌చైర్‌పర్సన్లు, పదిమంది కన్వీనర్లు, ముగ్గురు కార్యనిర్వాహక సభ్యులను నియమించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన ద్వివేది గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వైస్‌చైర్మన్లుగా ఎం.గమయ్య, సిద్ద ముత్యం, పల్లెపగు ప్రశాంత్, ఎస్.రాజలింగం, ఎస్.హేమంత్ కుమార్‌లను నియమించారు. కన్వీనర్లుగా శంకర్ చంద్రే, అజయ్ కుమార్, మల్లారపు చిన్నరాజం, పోల్లె డేవిడ్, వేల్పుల జయరాజ్, ఆశయ్య, ఎం.లక్ష్మీనారాయణ, మన్‌మోహన్, పర్కి నర్సింగ్‌రావు, ఎం. సూర్యకళను నియమించారు. వీరితోపాటుగా కె.కృష్ణవేణి, ఎన్.పార్వతి, కె,రమేశ్‌లను కార్యనిర్వాహక సభ్యులుగా నియమించారు.