తెలంగాణ

ఏడుగురు ఐపిఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ పోలీస్ విభాగంలో భారీ మార్పులు, చేర్పులు జరిగాయి. ఒకేసారి ఏడుగురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేస్తున్న వి నవీన్‌చంద్‌ను బదిలీ చేస్తూ ఐజిపి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఎన్ శివధర్‌రెడ్డిని ఐజిపి పర్సనల్‌గా డిజిపి ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న సందీప్ శాండిల్య సైబరాబాద్ కమిషనర్‌గా బదిలీ నియమితులయ్యారు. వరంగల్ రేంజ్ డిఐజి టి ప్రభాకర్‌రావు డిఐజి ఇంటెలిజెన్స్‌కు బదిలీ కాగా, డిఐజి ఇంటెలిజెన్స్‌గా పనిచేస్తున్న శివశంకర్‌రెడ్డి డిఐజి ఇంటెలిజెన్స్ పర్సనల్‌గా బదిలీ అయ్యారు. డిఐజి పోలీస్ సిఐడిగా పనిచేస్తున్న వరంగల్ రేంజ్ డిఐజిగా రవివర్మ బదిలీ అయ్యారు. సిఐడి ఎస్పీగా పనిచేస్తున్న రమేష్‌నాయుడు ట్రాఫిక్ డిసిపిగా రాచకొండ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు.