తెలంగాణ

దళితులకు టిఆర్‌ఎస్ ద్రోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ రాష్ట్ర సమితి దళితులను మోసం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి విమర్శించారు. బిజెపి అంటే భారతీయ జోకర్ పార్టీ అని విమర్శించిన రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడలేమని అన్నారు.
బుధవారం ఇక్కడి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి జోకర్ పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళుతున్నారు?, కేంద్ర మంత్రులు నగరానికి వస్తే భోజనానికి ఎందుకు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటి సిఎంగా దళితుడినే చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆయన టిఆర్‌ఎస్ నాయకులను తూర్పారబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మోసాలను ఎండగడతామని అన్నారు. కెసిఆర్ నిర్వహించిన చండీయాగంలో చివరి రోజున అగ్నిప్రమాదం జరిగితే మీడియా దానిని హైలైట్ చేయకపోవడానికి కారణం మీడియాను 10 కిలో మీటర్ల అడుగున పాతి పెడతానని కెసిఆర్ హెచ్చరించడమేనని అన్నారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తమ పార్టీపై చేసిన విమర్శలను పట్టించుకోవల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. పఠాన్‌కోట్‌లో పాక్ టెర్రరిస్టులు దాడులు చేస్తే ఖండించలేదని ఆయన దిగ్విజయ్‌ను విమర్శించారు. ఎన్నికల్లో వంద సీట్ల కంటే తక్కువ వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ చేసిన సవాల్ గురించి ప్రశ్నించగా, ఆయన మంత్రి పదవిలో ఉంటే ఎంత? ఊడితే ఎంత? అని కిషన్‌రెడ్డి అన్నారు. ఆ సవాల్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తే ఆలోచిస్తామని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి-బిజెపి సంయుక్తంగా వంద సీట్లు గెలుపొందాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు టిఆర్‌ఎస్ మాటలను విశ్వసిస్తే సెల్ఫ్‌గోల్‌లో పడతారని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని ఆకర్షించేందుకు టిఆర్‌ఎస్ నాయకులు యత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన టిఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు రూ. 20 వేల కోట్లు ఇప్పిస్తే బిజెపికి ఓటు వేస్తానని టిఆర్‌ఎస్ ఎంపి కవిత చేసిన సవాల్ గురించి ప్రశ్నించగా, జాతీయ రహదారుల కోసమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ. 43వేల కోట్లు ప్రకటించారని, దీనికి ఆమె ఏమంటారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్ నాయకులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లను కెసిఆర్ తన భుజాలపైకి ఎత్తుకున్నారని ఆయన విమర్శించారు.