తెలంగాణ

మందు బాబులకు గడ్డు రోజులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: మద్యం బాబులకు ముందున్నవన్నీ గడ్డురోజులే. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వీలుగా ఇప్పుడున్న మద్యం అమ్మకాల పరిమితులను మరింతగా కుదించాలని తెలంగాణ రోడ్డు సేఫ్టీ అథారిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ షరతుల అమలు విషయమై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి ఈ షరతులను వర్తింపచేయనున్నారు. ప్రస్తుతం అనుమతించిన బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బిఏసి) 100 ఎంఎల్‌కు 30 ఎంజి కాగా, దీనిని 15 ఎంజికి కుదించాలని కేంద్రానికి ప్రతిపాదించినట్లు తెలంగాణ రోడ్ సేఫ్టీ అథారిటీ అదనపు డైరెక్టర్ జనరల్ కృష్ణప్రసాద్ వెల్లడించారు. బిఏసి మార్కు అంటే ఐదు వందల ఎంఎల్ బీరు లేదా 30ఎంఎల్ పెగ్‌గా కొలుస్తారు. ఈ పరిధి దాటిందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం అతి కొద్దిగా అంటే పెగ్‌లో సగం సేవించి డ్రైవ్ చేసినా బ్రీతింగ్ పరికరం ద్వారా ఇట్టే కనిపెట్టేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిలో మద్యం సేవించే అలవాటు పెరగడంతో కొత్త నిబంధన అమలు చేయాలని కేంద్రానికి రాష్ట్ర అథారిటీ ప్రతిపాదన పంపింది. ఈ ఏడాది ఇప్పటివరకూ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసున్న వారు 287 మంది, 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వససున్న వారు 5,617 మంది, మైనర్లు ఏడుగురు ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరగడానికి మద్యం సేవించి వాహనాలు నడపడమే ప్రధాన కారణమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.