తెలంగాణ

ప్రాణం పోసుకున్న పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో మెట్టపంటలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. వరి పంట కాకుండా ఇతర పంటలు దాదాపు 70 లక్షల ఎకరాల్లో వేశారు. వీటిలో జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు, కందులు, ఉలవలు, పెసళ్లు, పల్లి (వేరుశనగ), పొద్దుతిరుగుడు, కుసుమ, సోయా, పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలు ఉన్నాయి. ఆగస్టు రెండో పక్షంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి ఏర్పడ్డది. జూన్, జూలై, ఆగస్టు మొదటి పక్షం వరకు వర్షాలు బాగానే ఉండటంతో రైతులు విత్తనాలు వేయడంలో నిమగ్నమయ్యారు. మొత్తం విస్తీర్ణంలో జూలై మొదటి పక్షం వరకే దాదాపు 80 శాతం విస్తీర్ణంలో విత్తనాలు వేశారు. ఆగస్టు 15 తర్వాత చాలా జిల్లాల్లో వర్షాలు కురవలేదు. ఆగస్టు 24 తర్వాత కొద్దికొద్దిగా వర్షాలు తిరిగి ప్రారంభమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆగస్టు చివరన, సెప్టెంబర్ ప్రారంభంలో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురవగా, దక్షిణ తెలంగాణలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. తాజా పరిస్థితిపై వ్యవసాయ శాఖ కమిషనర్ జిడి ప్రియదర్శిని శనివారం సమీక్షించారు. వ్యవసాయ మంత్రి పి. శ్రీనివాసరెడ్డి, ఈ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి అమెరికా పర్యటలో ఉండటంతో కమిషనర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటైంది. ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సమీక్షించారు. ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు జారీ చేస్తుండాలని, ఎరువులను సకాలంలో వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల్లోని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 110 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుంటారు. ఇందులో వరి పంట విస్తీర్ణం 25 లక్షల ఎకరాలు కాగా, మిగతా పంటలు 85 లక్షల ఎకరాల్లో ఉంటాయి. తాజా సమాచారం ప్రకారం 84 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. బావులు, బోర్‌బావులతో పాటు సాగునీటి వనరుల ద్వారా నీరు అందుతున్న ప్రాంతాల్లో ఇప్పటి వరకు 13 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. మరో ఏడు లక్షల ఎకరాల్లో త్వరలో వరినాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటున్నారు.
శ్రీశైలంలోకి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయంలోకి వరద కొనసాగుతోంది. 215 టిఎంసిల సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలోకి ఇప్పటి వరకు 153 టిఎంసిల నీరు చేరింది. ప్రస్తుతం జూరాల తదితర వనరుల నుండి శ్రీశైలంలోకి 14 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇతర జలాశయాల్లో పెద్దగా మార్పు లేదు. గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌లోకి ఇటీవల 41 టిఎంసిల నీరు చేరగా, పంటలకు నీటిని వదలివేస్తున్నారు. దాంతో ఈ జలాశయంలో శనివారం నాడు నమోదైన రికార్డు ప్రకారం 37.38 టిఎంసిల నీరు ఉంది. ఎగువప్రాంతం నుండి 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.