తెలంగాణ

భాగ్యనగరానికి భారీ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: సోమవారం నుంచి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నగరమంతా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటీవల పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదుల సానుభూతిపరుల సమాచారం మేరకు నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర జరగొచ్చనే అనుమానాలతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాల్లో ప్రత్యేక వైమానిక దళాలతోపాటు కేంద్ర బలగాలను మోహరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండులు, మాల్స్ వద్ద ప్రత్యేక పోలీస్ నిఘా పెట్టారు. నగరమంతా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ దళాలతోపాటు అశ్విక దళాలను కూడా రంగంలోకి దించారు. 20 వేల మందితో బందోబస్తును ఏర్పాటు చేసి ప్రధాన రహదారుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బక్రీదు, వినాయకచవితి పండగలు రెండు ఒకేసారి వచ్చినందున అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.