తెలంగాణ

తొలగని సందిగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: జిహెచ్‌ఎంసి ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అయినా కొన్ని పార్టీల అభ్యర్థులు పూర్తిగా తేలలేదు. ఈనెల 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా ‘బి-్ఫరం’ అందుకున్నవాళ్లే తుది అభ్యర్థులు అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి 150 డివిజన్లకు సుమారు 3 వేల నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి తప్ప అన్ని పార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం గందరగోళంగా, పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. తెరాస ఇప్పటివరకు 143మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో ఏడుగురికి ఫోన్ చేసి నామినేషన్ దాఖలు చేసుకోవాల్సిందిగా సూచించింది. ముఖ్యంగా మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, బిజెపి నేతల మధ్య శనివారం అర్థరాత్రి వరకూ చర్చలు జరిపినా డివిజన్ల ఎంపిక కొలిక్కి రాలేదు. కేవలం సీట్ల సంఖ్యపై మాత్రమే అంగీకారం కుదిరింది. ఇలాఉండగా డివిజన్ల ఎంపిక విషయానికి వచ్చేసరికి ఫలానా డివిజన్ తమకు బలంగా ఉందని, మంచి అభ్యర్థి ఉన్నాడని ఒక పార్టీ నాయకులు అంటే, అంతకంటే మంచి అభ్యర్థి తమకున్నాడని మరో పార్టీ అనడంతో సుమారు 60 డివిజన్ల విషయం తేలలేదు. చివరకు ముందుగా నామినేషన్లు వేసి ఉంచాల్సిందిగా ఇరు పార్టీల నేతలు తమ పార్టీ నాయకులకు సూచించారు. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసేలోగా భారీగా ఇరు పార్టీల ఆశావహులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణలోగా రెండు పార్టీల నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరి బి-్ఫరం ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ ఆదేశానుసారం టిక్కెట్‌రాని అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నామినేషన్ ఉపసంహరించుకోనని భీష్మించుకుని కూర్చుంటే, ఆ అభ్యర్థి స్వతంత్రుడిగా బరిలో ఉంటాడు. కాబట్టి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాతే స్పష్టత వస్తుంది. అప్పటి వరకు విదాదస్పదంగా ఉన్న డివిజన్ల అసలైన అభ్యర్థులు ఎవరో చెప్పడం కష్టం.
ఇలాఉండగా తెలుగు దేశం పార్టీ ఆదివారం 81మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. బిజెపి 30మందితో ఒక జాబితాను ప్రకటించింది. అయినా, తెదేపా ప్రకటించిన డివిజన్లలో కొన్ని మార్పులు జరుగుతాయని బిజెపి నేతలు చెబుతున్నారు. తాము అంగీకరించని కొన్ని స్థానాలను తెదేపా ప్రకటించిందని అంటున్నారు. తెదేపా -్భజపాల్లో టిక్కెట్లు దక్కని ఆశావహులు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏ ఇబ్బందీ లేకుండా టిక్కెట్లను ప్రకటించింది. కాగా తెరాస ఎమ్మెల్యే కనకారెడ్డి తన కోడలు విజయశాంతి రెడ్డికి ఆల్వాల్ డివిజన్ టిక్కెట్ ఇప్పించుకోవడంతో, స్థానిక తెరాస నాయకులు భగ్గుమన్నారు. దీంతో ఆ డివిజన్ స్థానాన్ని ఆశించిన తోట సుజాత గోపాల్ రెడ్డి రెబల్‌గా బరిలోకి దిగినట్టు ప్రకటించారు. ఆమెను బరినుంచి తప్పించేందుకు పార్టీ నేతలు యత్నిస్తున్నారు. తెదేపాకు కుద్బుల్లాపూర్ తదితర అనేక డివిజన్లలో సమస్య ఉత్పన్నమైంది. టిక్కెట్లు దక్కని ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసి రెబెల్స్‌గా నిలబడ్డారు. బిజెపికి కేటాయించిన సీట్లలో తెదేపా అభ్యర్థులు నిలబడటంతో, పొత్తుకు బ్రేక్ అవుతుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. భాజపా ఇంతవరకు జాబితా ప్రకటించలేదు కాబట్టి ఆ పార్టీ రెబెల్స్ ఎవరో ఇంకా బయటపడలేదు. ఆశావహులు నామినేషన్లు వేసి ‘బి-్ఫరం’ దక్కించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలిసిన నాయకులతో పార్టీ రాష్ట్ర నాయకత్వంపై వత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదివారం 31మందితో మూడో జాబితా విడుదల చేయడంతో, అనేక డివిజన్లలో ఆశావహులు భగ్గుమన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నా, పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నామని, ఈ సమయంలో తమకు టిక్కెట్ ఇవ్వకుండా మరో అభ్యర్థికి ఎలా టిక్కెట్ కేటాయిస్తారంటూ ఆందోళనలకు దిగారు. రామంతాపూర్, ఢబీర్‌పురా, ఐఎస్ సదన్ తదితర డివిజన్లలో తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. రెబెల్స్‌ను బరినుంచి తప్పించేందుకు పార్టీ నేతలు కష్టపడుతున్నారు. మరోవైపు మజ్లిస్‌లో టిక్కెట్ రాని కొంతమంది నాయకులు కాంగ్రెస్‌లో చేరారని, వారికి టిక్కెట్లు ఇస్తే సహించేది లేదని ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.