తెలంగాణ

టిడిపి అంటే టిఆర్‌ఎస్‌కు భయం: రేవంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: టిఆర్‌ఎస్ పార్టీకి తెలుగుదేశం అంటే భయం పట్టుకుందని టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌కు తిరోగమనం మొదలైందని, తండ్రి ఫామ్ హౌస్‌లో ఉంటే కొడుకు అతిథి గృహంలో ఉంటున్నాడని, బావని కలిస్తే బామ్మర్దికి కోపం వస్తోందని, ఆత్మగౌరవం వదులుకుని పొర్లుదండాలు పెట్టాల్సిందేనని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో పలు కారణాలతో ఆ పార్టీలో చేరిన వారంతా ఇపుడు అందులో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు. పార్టీ నేతలు ఎవరిని కలవాలో తెలియని అయోమయంలో ఉన్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీనివాసరెడ్డి టిఆర్‌ఎస్ నుండి తిరిగి టిడిపిలోకి చేరిన సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. నీళ్లు ఎక్కువ ఉన్నా ఉండాల్సిన చేపలు కంటే ఎక్కువ ఉంటే ఆక్సిజన్ అందకపోవడం వల్ల చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.