తెలంగాణ

విద్యుత్ కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి), సింగరేణి కాలరీస్‌తో తెలంగాణ ట్రాన్స్‌కో సోమవారం వేర్వేరుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్‌రావు, ఎన్టీపీసీ జనరల్ మేనేజర్లు సివి ఆనంద్, ఎస్‌కె ఖర్, అడిషనల్ జనరల్ మేనేజర్ కె సుదర్శన్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ కేంద్రం నుంచి 1600 మెగావాట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సెంట్రల్ విద్యుత్ నియంత్రణ మండలి సిఫారసుల ప్రకారం రేటు చెల్లించడానికి ట్రాన్స్‌కో అంగీకరించింది. అలాగే సింగరేణి కాలరీస్ జైపూర్ కేంద్రం నుంచి 1200 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి సిఎండి ప్రభాకర్‌రావు, సింగరేణి సిఎండి ఎన్ శ్రీ్ధర్‌ల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌నాటికి 1200 మెగావాట్ల విద్యుత్ అందించడానికి సింగరేణి అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సిఫారసుల మేరకు రేటు చెల్లించే విధంగా విద్యుత్ కొనుగోలుకు ట్రాన్స్‌కో అంగీకరించింది. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో కార్యదర్శి అరవింద్ కుమార్, ఎన్‌పిడిసిఎల్ సిఎండి వెంకటనారాయణ, ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, కరీంనగర్ ఎంపీ బి వినోద్‌కుమార్, సింగరేణి డైరెక్టర్ బి రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... సిఎం సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న సింగరేణి, ట్రాన్స్‌కో అధికారులు