ఆంధ్రప్రదేశ్‌

టిడిపి, బిజెపిలకు గోరీనే: రాఘవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాటమార్చిన బిజెపి, అందుకు వంత పాడుతున్న తెలుగుదేశం ప్రభుత్వాలకు ఎపి ప్రజలు గోరీ కడతారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. విశాఖలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చిన బిజెపి తీరా ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్దత ఉండదని, ప్రభుత్వాలు మారితే ప్యాకేజీ తీరూ మారుతుందన్నారు. ఇదే ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రానికి వచ్చే నిధులు, ప్రాజెక్టులకు చట్టబద్దత ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు హోదా రద్దయ్యే ప్రమాదం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం భయపెడుతోందని ఆరోపించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో బిజెపి, టిడిపిలకు ప్రజలు గోరీ కడతారన్నారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో స్పష్టత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వీటిని నివృత్తి చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.
అలాగే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ అంశంలో కూడా కేంద్రం దోబూచులాడుతోందని విమర్శించారు. అసలు ఎపికి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తారో ఇవ్వరో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కమ్యూనిస్టుల పోరాటాలను ప్రశంసించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పోరాట యోధుడు చేగువేరా అభిమానిగా చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ తుపాకీ చేతపట్టకపోయినా, ప్రజల తరపున పోరాటాలకు ముందుకు వస్తే మంచిదేనన్నారు. రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై పోరాటం సాగించాలని కోరారు.