తెలంగాణ

గణతంత్రం..ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణలో 67వ గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా కేంద్రాల్లో గణతంత్ర వేడుకలు కట్టుదిట్టమైన భద్రతల మధ్య ప్రశాంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడవచ్చని ఇంటెలిజన్స్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సికిందరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో వెయ్యిమందితో భద్రతా ఏర్పాట్లు చేసి పరేడ్ గ్రౌండ్ మార్గాల్లో తనిఖీలు నిర్వహించారు. రాపిడ్ యాకషన్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ఫోర్స్, బాంబ్ స్క్వాడ్స్, జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. నగరమంతా సిసి కెమెరాల నిఘాలో ఉండగా పెట్రోలింగ్ వాహనాలు గస్తీ నిర్వహించాయి.
సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎల్‌ఎన్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించగా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కె అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డిజిపి కార్యాలయంలో అనురాగ్ శర్మ, చంచల్‌గూడ జైల్లో జైళ్లశాఖ డిజి వికె సింగ్, కమిషనర్ కార్యాలయంపై నగర కమిషనర్ మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితోపాటు అదనపు సిపి అంజనీకుమార్, ట్రాఫిక్ కమిషనర్ జితేందర్ పర్యవేక్షించారు. సికిందరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

67వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న గవర్నర్ నరసింహన్

చంద్రుల పాలన భేష్

ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఇద్దరితోనూ సత్సంబంధాలు
ఎందుకు రాలేదో తెలీదు ‘ఎట్ హోం’లో గవర్నర్ వ్యాఖ్య

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 26: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలన చక్కగా ఉందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కితాబు ఇచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులుకూడా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నారని గవర్నర్ అభినందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం ప్రముఖులకు గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి ఇరువురు ముఖ్యమంత్రులు గైర్హాజర్ అయ్యారు. ఈ విషయాన్ని గవర్నర్ వద్ద మీడియా ప్రస్తావించగా, వారిద్దరితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, వారు ‘ఎట్ హోం’ కార్యక్రమానికి రాకపోవడానికి కారణాలు ఏమిటో తెలియదని వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంత వరకు వారిద్దరు కూడా సఖ్యతగానే మెలుగుతున్నారని గవర్నర్ అన్నారు. ఇలాఉండగా ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మదుసూధనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగశర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పుర ప్రముఖులు హాజరయ్యారు.

రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ,
ఏపి మంత్రులు గంటా వ్రీనివాసరావు , అచ్చంనాయుడు, దేవినేని ఉమామహేశ్వరావు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరైన టి.హోం మంత్రి నాయని, ఉప ముఖ్యమంత్రి కడియం, టి.స్పీకర్ మధుసూదనాచారి, ఏపి కౌన్సిల్ చైర్మన్ చక్రపాణి, ఈనాడు అధినేత రామోజీరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్