తెలంగాణ

మతతత్వ శక్తుల అడ్డాగా హైదరాబాద్: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: హైదరాబాద్ నగరం మతతత్వ శక్తులకు అడ్డాగా మారిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. మంగళవారం సైదాబాద్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన బిజెపి బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. బీఫ్ కావాలంటే మజ్లిస్ పార్టీకి ఓటు వేయాలని అనడం దుర్మార్గమైన చర్య అని ఆయన విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పాత నగరాన్ని అభివృద్ధి చేయడానికి మజ్లిస్ పార్టీ ఏనాడూ ప్రయత్నం చేయలేదని, కేవలం రాజకీయ పబ్బం కోసం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తోందని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వేలాది మందికి రుణాలు అందజేస్తున్నామని దీని ద్వారా ఎందరో ప్రయోజకులవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను ఎంపిక చేసిందని, మరో 500 పట్టణాలను అమృత్ పథకం కింద అభివృద్ధి చేస్తుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా వౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం 416కోట్లు కేటాయించిందన్నారు. 2022 నాటికి అందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 29500 ఇళ్లను కేటాయించామని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
2021 నాటికి పేదలందరికీ ఇళ్లు
2021 నాటికి సొంతిల్లు లేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని కేంద్ర పట్టణ ప్రణాళికా శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం చంపాపేట్ డివిజన్ బిజెపి అభ్యర్థి వంగ మధుసూదన్‌రెడ్డి, ఐఎస్‌సదన్ డివిజన్ అభ్యర్థి కొంతం సునీతారెడ్డిలకు మద్దతుగా చంపాపేట్ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ హైదరాబాద్ నగరంలో 29వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు. మతోన్మాదం, ఉగ్రవాదులను పెంచిపోషించే పార్టీలకు చెక్ పెట్టాలని కోరారు. నగరంలో 4లైన్ల రోడ్లు, విమానాశ్రయం, ఫై ఓవర్లను ఏర్పాటు చేసిన ఘనత టిడిపి, బిజెపిలకే దక్కుతుందని అన్నారు. కేంద్రప్రభుత్వం ముద్రా బ్యాంక్ ద్వారా పేదప్రజలకు రుణాలు మంజూరు చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు ఇంద్రసేనారెడ్డి, ఆచారి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

జెండాకు జై.. ప్రచారానికి సై
అభ్యర్థులకు కలిసొచ్చిన రిపబ్లిక్ డే
వాడవాడలా జాతీయ పతాకావిష్కరణలు
పనిలోపనిగా ఓటువేయాలని వినతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 26: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గణతంత్ర దినోత్సవం కలిసొచ్చింది. మంగళవారం ఉదయం ప్రచారంలో పాల్గొన్న నాయకులు పనిలో పనిగా జాతీయ పతాకాలను ఆవిష్కరించడంతోపాటు తమ పార్టీకి ఓట్లు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జాతీయ పర్వదినాల సందర్భంగా ప్రధాన వీధులలో, ముఖ్య కూడళ్లలో మాత్రమే సాధారణంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు జరిగేవి. అయితే జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రతి వీధిలోనూ, చౌరస్తాలలోనూ ఒక్కోచోట పార్టీలవారిగా మూడు, నాలుగేసి జెండాలను ఎగురవేయడం ఈసారి ప్రత్యేకత. నగరంలోని ప్రధాన కూడళ్లలో దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు జెండా గద్దెలు ఉన్నాయి. వీటి పక్కనే తాత్కాలికంగా జెండా గద్దెలను ఏర్పాటు చేసి జాతీయ పతాకాలను ఎగురవేశారు. పనిలోపనిగా పార్టీ జెండాలను కూడా ఎగురవేసి అభ్యర్థులు అక్కడే ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి త్రివర్ణ పతాకాల లోగోలతోపాటు కరపత్రాలను పంపిణి చేశారు. ఎన్నికల నేపథ్యంలోనైనా అన్ని పార్టీలు జాతీయ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవడం హర్షించదగ్గ పరిణామం.