బిజినెస్

ఐడిఎస్ డిక్లరేషన్ల కోసం 30న అర్ధరాత్రి దాకా ఐటి ఆఫీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: నల్లధనం వెలికి తీయడం కోసం ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ డిక్లరేషన్ పథకం (ఐడిఎస్) కింద డిక్లరేషన్లు ఇవ్వడానికి గడువు ఈ నెల 30 తేదీతో ముగియనున్న నేపథ్యంలో దేశంలోని అన్ని కార్యాలయాలను 30వ తేదీ అర్ధరాత్రి దాకా తెరిచి ఉంచాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఆదాయం పన్ను విభాగాన్ని ఆదేశించింది. ‘2016 ఐడిఎస్ కింద డిక్లరేషన్లు చేయడానికి సెప్టెంబర్ 30 చివరి రోజు. అందువల్ల ఆ రోజు అర్ధరాత్రి దాకా కూడా డిక్లరేషన్లు దాఖలు చేయవచ్చు. కార్యాలయం పని గంటల తర్వాత కూడా డిక్లరేషన్లు దాఖలు చేయడానికి వీలుగా ఈ పథకం కింద డిక్లరేషన్లు అందుకోవడం కోసం సెప్టెంబర్ 30వ తేదీన అన్ని జ్యురిస్‌డిక్షన్లలోను కార్యాలయాలను అర్ధరాత్రి దాకా తెరిచి ఉంచేలా చూడాలని ముఖ్య చీఫ్ కమిషనర్లను కోరడమైంది’ అని సిబిడిటి గురువారం ఒక ఉత్తర్వులో పేర్కొంది. దీనికి సంబంధించి సిబిడిటి చీఫ్ రాం సింగ్ ఈ నెల 17న దేశంలోని అన్ని ప్రాంతీయ ఐటి రీజినల్ కమిషనర్లతో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కాగా, ఐడిఎస్ పథకం కింద ఈ నెల 30వరకు ఐటి శాఖకు అందే సమాచారం, డిక్లరేషన్లు అన్నిటినీ రహస్యంగా ఉంచడం జరుగుతుందని ప్రభుత్వం గురువారం మరోసారి స్పష్టం చేసింది.